Telugu Global
Cinema & Entertainment

'సాహో' కీలక షెడ్యూల్ మొదలు

బాహుబలి విడుదల అయ్యి సక్సెస్ అయ్యి… జపాన్ లాంటి దేశం లో కూడా ఈ సినిమా అభిమానులని అలరించిందంటే ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చూ. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ లో చాలా తేడా వచ్చింది. ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రం కాదు. భారతీయ పరిశ్రమ లో స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో ప్రభాస్ కూడా ఒకడు. అందుకే తన తదుపరి […]

సాహో కీలక షెడ్యూల్ మొదలు
X

బాహుబలి విడుదల అయ్యి సక్సెస్ అయ్యి… జపాన్ లాంటి దేశం లో కూడా ఈ సినిమా అభిమానులని అలరించిందంటే ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చూ.

బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రేంజ్ లో చాలా తేడా వచ్చింది. ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రం కాదు. భారతీయ పరిశ్రమ లో స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో ప్రభాస్ కూడా ఒకడు. అందుకే తన తదుపరి చిత్రం సాహో మీద అందరి దృష్టీ పడింది.

అభిమానులందరూ ఈ సినిమా గురించి ఆసక్తి గా ఎదురు చూస్తుంటే, ఇంకా షూటింగ్ పూర్తి చెయ్యలేదు. సుజీత్ దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ నేడు రామోజీ ఫిలిం సిటీ లో ప్రారంభం కానున్నది.

భారీ బిల్డప్, భారీ బడ్జెట్ తో, కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ని చిత్రీకరించనున్నారు దర్శక నిర్మాతలు.

ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వరకు రానటువంటి ఒక పెద్ద ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఈ సినిమా లో మనం చూడబోతున్నామట. ఈ వారం మొత్తం రామోజీ ఫిలిం సిటీ లో ఈ షూటింగ్ జరుగుతుందని టాక్. ఈ సినిమా ద్వారా శ్రద్ధ కపూర్ తెలుగు లో అరంగేట్రం చేయనుండడం విశేషం.

First Published:  24 March 2019 11:52 PM GMT
Next Story