నిహారికకు నేను బిగ్ బ్రదర్

మొన్నటివరకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ తెగ పుకార్లు వచ్చాయి. యూట్యూబ్ ఛానెళ్లలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వచ్చాయి. కట్ చేస్తే, కొణెదల నిహారిక తనకు చెల్లెలు లాంటిదని ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ. సూర్యకాంతం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన దేవరకొండ, నిహారికను ఓ బిగ్ బ్రదర్ లా చూసుకుంటానని నిండు సభలో ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

“నేను, నాగబాబు గారు కలిసి గీతగోవిందం సినిమా చేశాం. నిజంగా ఆయన తండ్రిలా అనిపించారు. ప్రస్తుతం నాగబాబు గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ అమెరికాలో ఉన్నాడు. చరణ్ అన్నయ్య కూడా అమెరికాలో ఉన్నట్టున్నాడు. అందుకే సూర్యకాంతం సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఓ బిగ్ బ్రదర్ లా హాజరయ్యాను.”

ఇలా తనకు, నిహారికకు మధ్య ఉన్న బాండింగ్ ను బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. మొన్నటివరకు వీళ్లిద్దరిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటికీ విజయ్ దేవరకొండ స్టేట్ మెంట్ తో చెక్ పడింది.

మరోవైపు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన విజయ్ దేవరకొండ కొత్త గెటప్ లో కనిపించాడు. క్లీన్ షేవ్ చేశాడు. మీసం డిఫరెంట్ గా ఉంచాడు. ఇదంతా నెక్ట్స్ సినిమా కోసం అతడు చేస్తున్న మేకోవర్.