పోలీసులకు జగన్ హామీలు…

కొందరు పోలీసులకు చంద్రబాబు తొడిగిన పచ్చచొక్కాలను విప్పిస్తామన్నారు వైఎస్ జగన్‌. పోలీసులకు వైఎస్ జగన్‌ వరాల జల్లు కురిపించారు. పోలీసుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

పోలీసులకు వారంలో ఒకరోజు వీకాఫ్ ఇస్తామన్నారు. వీకాఫ్‌ వల్ల ఇబ్బందులు రాకుండా మరింత మందిని రిక్రూట్‌ చేస్తామన్నారు. కొందరు పోలీసులకు చంద్రబాబు తొడిగిన పచ్చ చొక్కాలను విప్పుతామన్నారు. హోంగార్డులకు మెరుగైన
జీతం ఇస్తామన్నారు.

అధికారంలోకి రాగానే చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. తోపుడు బండ్లపై, ఫుట్‌పాత్‌ పై వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులతో పాటు అవసరమైనప్పుడు వారికి 10వేల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు.