Telugu Global
NEWS

ఐదేళ్ళలో ఏం సాధించావో చెప్పు?

ప్రత్యేక హోదాను బాబు-మోడీ జోడి సమాధి చేసిందన్నారు వైఎస్ షర్మిల. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె… ఏ అర్హత ఉందని నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చి మూడు కీలక శాఖలు అప్పగించారని ప్రశ్నించారు. ఇష్టానుసారం అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు మరోసారి ఎందుకు ఓటేయాలని నిలదీశారు. ఆరు వందల హామీల్లో ఏ హామీనైనా పూర్తిగా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిని పక్కన పడేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో హామీలను నెరవేర్చి ఉంటే ఆ విషయం చెప్పి […]

ఐదేళ్ళలో ఏం సాధించావో చెప్పు?
X

ప్రత్యేక హోదాను బాబు-మోడీ జోడి సమాధి చేసిందన్నారు వైఎస్ షర్మిల. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె… ఏ అర్హత ఉందని నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చి మూడు కీలక శాఖలు అప్పగించారని ప్రశ్నించారు.

ఇష్టానుసారం అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు మరోసారి ఎందుకు ఓటేయాలని నిలదీశారు. ఆరు వందల హామీల్లో ఏ హామీనైనా పూర్తిగా నిలబెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. వాటిని పక్కన పడేసి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొత్త హామీలతో మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో హామీలను నెరవేర్చి ఉంటే ఆ విషయం చెప్పి ఓట్లు అడగాలన్నారు.

చంద్రబాబు తాను చందమామను తెస్తానంటే మరోసారి నమ్మి మోసపోవాలా? అని ప్రశ్నించారు. రెండు రూపాయలకే 20 లీటర్ల మంచినీరు ఇస్తానన్న చంద్రబాబు ఆ పథకాన్ని అమలు చేశారా? అని నిలదీశారు. తాను నిప్పునని చెప్పుకున్నంత
మాత్రాన…. తుప్పు నిప్పు అవుతుందా అని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ను నేను నిర్మించానని సొల్లు కబుర్లు చెబుతున్న చంద్రబాబు ఈ ఐదేళ్ళలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా ఎందుకు కట్టలేకపోయారని నిలదీశారు. చంద్రబాబుకు చేతనైతే నిజాలు చెప్పాలని సవాల్ చేశారు.

ఇన్నిరోజులు జగన్‌ ఊరూరు తిరిగి హోదా కోసం పోరాటం చేయకపోయి ఉంటే ఈరోజు చంద్రబాబు హోదా అంశం గురించి మాట్లాడేవారా అని ప్రశ్నించారు. ముందు బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు… మొదట హోదా… ఆ తర్వాత
ప్యాకేజ్… తిరిగి ఇప్పుడు హోదా…. ఇదీ చంద్రబాబు తీరు అని షర్మిల విమర్శించారు.

చంద్రబాబు పాలన ఎలా ఉందో ప్రజలు చూశారని… ఒక్క అవకాశం తన అన్న జగన్‌మోహన్‌ రెడ్డికి ఇవ్వాలని షర్మిల కోరారు. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి ఓటేయాలని షర్మిల కోరారు. ఏపీ దుర్మార్గుల చేతుల్లో చిక్కుకుందని మరోసారి పొరపాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ మరో పాతికేళ్లు వెనక్కు వెళ్తుందన్నారు.

చంద్రబాబును మించిన దుర్మార్గుడు, నీచుడు మరొకరు ఉండరని స్వయంగా ఎన్టీఆరే అన్నారన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌- టీడీపీకి మధ్య అని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఇక్కడ వైసీపీ బంపర్‌ మెజారిటీతో గెలిచే పరిస్థితి
ఉంటే చంద్రబాబు మాత్రం ఇలా మాట్లాడేందుకు సిగ్గు ఉండాలన్నారు. పవన్ కల్యాణ్ ఒక నటుడు అని… చంద్రబాబు డైరెక్టర్ అని… అందుకే డైరెక్టర్ చెప్పినట్టుగానే పవన్ నటిస్తున్నారని…. అది అందరికీ తెలిసిందేనన్నారు.

కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి గురైతే దానిపై ఇంత వరకు పవన్‌ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని … దీనిపై ఆయన్ను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని షర్మిల నిలదీశారు. వైఎస్ వివేకా నందరెడ్డి హత్యపై తాము థర్డ్ పార్టీ విచారణ కోరుతుంటే పవన్ కల్యాణ్‌ మాత్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌కు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టేనని… జనసేనకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టేనని షర్మిల వ్యాఖ్యానించారు.

తమ కుటుంబానికి పెద్దగా ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డిని తామెందుకు చంపుకుంటామని ప్రశ్నించారు. దారుణంగా హత్య చేయించి… తిరిగి బాధితులమైన తమపై చంద్రబాబు నిందలు వేస్తున్నారన్నారు. బాధితులనే నిందితులుగా
చూపించి… అసలు హంతకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

గతంలో తన తాతా రాజారెడ్డిని కూడా ఇలాగే హత్య చేస్తే వారికి చంద్రబాబు మద్దతు ఇచ్చింది నిజం కాదా అని నిలదీశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేతల హస్తం లేకపోతే థర్డ్ పార్టీ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు ఆదేశించాలన్నారు.

First Published:  25 March 2019 1:05 AM GMT
Next Story