తాడిపత్రి జేసీ అబ్బసొత్తా?

తాడిపత్రిలో వైఎస్ జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ సభకు వేలాదిగా జనం తరలి వచ్చారు. తాడిపత్రి వీధులన్నీ జనంతో స్థంభించిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు పోటెత్తారు. జగన్‌కు ఘనస్వాగతం పలికారు. జేసీ ఇలాకాలో ఈస్థాయిలో జనం రావడం చర్చనీయాంశమైంది.

తాడిపత్రి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే రోజు దగ్గరలోనే ఉందన్నారు తాడిపత్రి వైసీపీ అభ్యర్థి పెద్దారెడ్డి. తాడిపత్రిలో గాలి, నీరు అన్నీ తమ సొంతం అన్నట్టుగా జేసీ బ్రదర్స్‌ వ్యవహారం ఉందన్నారు. జేసీ సోదరులు ఎంతటి నీచులో ప్రజలందరికీ తెలుసన్నారు.

చికెన్ షాపులో చికెన్‌ పైనా కిలోకు 20 రూపాయలు మామూళ్లు వసూలు చేస్తున్న చరిత్ర జేసీ సోదరులదన్నారు.
ప్రతి గ్రామానికి జేసీ దివాకర్ రెడ్డి వెళ్లి… వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని…. కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

ఎన్నికల తర్వాత జేసీ సోదరులే తాడిపత్రి వదిలి వెళ్లిపోతారన్నారు. ఎవరికి ఎంత కష్టమొచ్చినా… రెండేళ్లుగా మీ ఇంటి ముందు వచ్చి నిలబడుతున్నానని… అదే తరహాలో భవిష్యత్తులోనూ అండగా ఉంటానన్నారు. ధైర్యంగా వైసీపీకి ఓటేసి  గెలిపించాలన్నారు.

ఎన్నికల హీట్ మొదలైనప్పటి నుంచి తాడిపత్రిలో సాక్షి టీవీ ప్రసారాలు కూడా రావడం లేదన్నారు. డిష్‌ నడుపుతున్న వారు వ్యాపారాన్ని వ్యాపారంలా చేసుకుంటే మంచిందన్నారు. తాడిపత్రి జేసీ సోదరుల అబ్బసొత్తు కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు పెద్దారెడ్డి.