పవన్ ఇకనైనా ముసుగు తీసెయ్‌ – బొత్స

ఏపీలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవడం ఖాయమన్నారు వైసీపీ నేత బొత్సా సత్యనారాయణ. పవన్‌ కల్యాణ్‌ ముసుగు తీసేసి నేరుగా చంద్రబాబుతో కలిసి పోటీ చేయాలన్నారు.

2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి కారణం తానేనని ప్రకటించుకున్న పవన్‌ కల్యాణ్… ఇప్పుడు మరోసారి చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పవన్‌ కల్యాణ్‌కు రాజకీయాలంటే ఎలా కనిపిస్తున్నాయని
ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు… ఐదేళ్లలో విజయవాడలో దుర్గ ఫ్లై ఓవర్‌ను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ను ఎవరైనా విమర్శిస్తే ఆయనకు రోషం వస్తుందని… అదే తరహాలో తాను
ఇతరులను తిట్టినా వారికి కూడా రోషం వస్తుందన్న విషయం గుర్తించుకుని మాట్లాడాలన్నారు.

ఈ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకుని ఓట్లడిగే ధైర్యం లేని చంద్రబాబు ఇతర అంశాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.