మందిని దింపుతున్న చంద్రబాబు

ఇప్పటికే ఏపీలో ఉన్న మిత్రులు చాలరని… పక్క రాష్ట్రాల నుంచి కూడా నేతలను తెచ్చుకుంటున్నారు చంద్రబాబు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దేవేగౌడ, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా…. ఇలా తనకు పరిచయం ఉన్న నేతలందరినీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు రప్పిస్తున్నారు.

ఢిల్లీలో నిజాయితీ పాలన చేస్తున్న కేజ్రీవాల్‌ కూడా 18 కేసుల్లో స్టేలు, అనేక అవినీతి ఆరోపణలు ఉన్న
చంద్రబాబును గెలిపించాలంటూ ప్రచారానికి వస్తుండడం ఆసక్తిగా ఉంది.

జాతీయ నాయకులను తెచ్చి వారి వారి కులాల వారు ఎక్కువగా ఉన్నప్రాంతంలో ప్రచారం చేయించబోతున్నారు. ఫరూక్ అబ్దుల్లాను ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయిస్తున్నారు. అఖిలేష్ యాదవ్‌ను వైసీపీ తరపున అనిల్‌
కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న నెల్లూరు స్థానంలో ప్రచారం చేయించనున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడను లింగాయత్‌ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి దింపుతున్నారు.

మంగళవారం కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కడపలో ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు, ఫరూక్‌ కలిసి కడప కూడలిలో బస్సు మీద నుంచి ప్రసంగించారు.

అయితే ఏపీ ముఖ్యమంత్రి, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ వచ్చినా సరే కడప కూడలిలో జనం స్వల్పంగానే రావడం కనిపించింది. ఇంత తక్కువ మంది జనం రావడంతో ఫరూక్ సమక్షంలో తన పరువు పోయిందని… మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.