Telugu Global
Health & Life Style

అమ్మో అతిసార.... ఈ జాగ్రత్తలు పాటించాలి..!

వేసవి కాలం… ఎండలు ముదురుతున్నాయి…. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 7 గంటలైనా ఆ వేడి తగ్గడం లేదు. ఈ ఎండల కారణంగా ఎక్కడలేని రోగాలు వేధిస్తాయి. వేసవి కాలంలో తరచుగా వచ్చే వ్యాధి అతిసార…. మనిషిని నిలువునా పీల్చి పిప్పి చేసే అతిసార వ్యాధి లక్షణాలు…. దాని నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.. అతిసార… వేసవిలో వేధించే తొలి వ్యాధిగా ఈ అతిసారకు పేరుంది. నీటి ద్వారా […]

అమ్మో అతిసార.... ఈ జాగ్రత్తలు పాటించాలి..!
X

వేసవి కాలం… ఎండలు ముదురుతున్నాయి…. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాయంత్రం 7 గంటలైనా ఆ వేడి తగ్గడం లేదు. ఈ ఎండల కారణంగా ఎక్కడలేని రోగాలు వేధిస్తాయి. వేసవి కాలంలో తరచుగా వచ్చే వ్యాధి అతిసార…. మనిషిని నిలువునా పీల్చి పిప్పి చేసే అతిసార వ్యాధి లక్షణాలు…. దాని నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం..

అతిసార…

వేసవిలో వేధించే తొలి వ్యాధిగా ఈ అతిసారకు పేరుంది. నీటి ద్వారా సంక్రమించే ఈ అతిసార వేసవి కాలంలోనే ఎక్కువగా రావడానికి కారణం కలుషిత నీరు తీసుకోవడమే.

డయేరియా అని కూడా పిలిచే వ్యాధి ఒక్క పట్టణాలు, నగరాలకే పరిమితం కాదు. చిన్న చిన్న పల్లెల్లో కూడా ఇది వ్యాఫిస్తుంది. అతిసార అనే వ్యాధి సోకడానికి కారణం రోటా వైరస్‌. ఈ ఆరోగ్య సమస్య వల్ల శారీరకంగానే కాదు…. మానసికంగా కూడా మనిషిని నిస్తేజంగా మార్చేస్తుంది.

ఈ వ్యాధి సోకిందనడానికి ముఖ్య లక్షణం విరేచనాలు. ఒక పక్క విరోచనాలు… మరో పక్క రక్తం కూడా పడితే అదే ‘డీసెంట్రి’. గాలిలోను, నీటిలోను, ఆహార పదార్ధాలలోనూ ఉండే ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్ కారణంగా వస్తుంది. రోజుకు మూడు కంటే ఎక్కువ సార్లు పలుచగాను, జిగటగానూ విరేచనాలు అయితే దానిని అతిసారగా అనుమానించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

అతిసార లక్షణాలు…

ఈ వ్యాధి ముఖ్య లక్షణం వేధించే వాంతులు. మనిషిని నిసత్తువుగా చేసే విరేచనాలు. ఈ రెంటితో పాటు జ్వరం. అయితే, ఈ జ్వరం చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఒకవేళ అతిసార కాస్తా డీసెంట్రి అయితే…. అన్నం రుచించకపోవడం, రక్త విరేచనాలు, నిరంతరం వేధించే వికారం ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి పెద్ద వారికి సోకితే రెండు, మూడు రోజులలో తగ్గుముఖం పడుతుంది. అదే చిన్న పిల్లల్లో అయితే ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది. అతిసార తీవ్రం అయితే పదిహేను రోజుల ఇది వేధిస్తుంది.

అతిసార… నిర్ధారణ

ఈ వ్యాధిని గుర్తించడానికి పరీక్షలు అవసరం అయినా… ముందుగా ఇంట్లో వారికే చూచాయిగా తెలిసిపోతుంది. రోగి తరచుగా విరేచనాలతో బాధపడడం జరిగితే దాన్ని అతిసారగా అనుమానించాలి. వెంటనే రక్త పరీక్షలు చేయించాలి.

అతిసార వ్యాధి…. చికిత్స

ఈ వ్యాధికి డాక్టర్లు ఇచ్చే మందుల కంటే ఇంట్లో వారే ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అతిసార సోకిన వారికి రెోజుకు కనీసం నాలుగైదు సార్లు ఉప్పు, పంచదార కలిపిన నీరు తాగించాలి. పాలు కలపని సగ్గుబియ్యం జావ పట్టించాలి. రోగి వికారం కారణంగా నోటి ద్వారా ద్రవ పదార్ధాలను తీసుకోవడం కష్టం అయితే…. సెలైన్‌ ఎక్కిస్తే చాలా మేలు. ముఖ్యంగా ఈ అతిసార వ్యాధి వచ్చిన వారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.

First Published:  25 March 2019 8:32 PM GMT
Next Story