మళ్లీ బోల్డ్ చిత్రం లో…. హెబ్బా 

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమా లో హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత కూడా నిఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది హెబ్బా.

కానీ ఆ తర్వాత విడుదలైన 5 సినిమాలు వరుసగా డిజాస్టర్ లుగా నిలిచాయి. ఈ మధ్యనే విడుదలైన ’24 కిస్సెస్’ సినిమాలో తన గ్లామర్ డోస్ ను మరింతగా పెంచింది. కానీ ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించలేకపోయింది.

అయినప్పటికీ తన తదుపరి సినిమాలో కూడా అదే ఫార్ములాను వాడనుంది హెబ్బా. మరొక బోల్డ్ సినిమాలో నటించనుంది హెబ్బా పటేల్. సుశాంత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం లో ‘రాడికల్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు.

ఇంతకుముందు సినిమాల్లో కంటే ఈ సినిమాలో హెబ్బా పటేల్ మరింత గ్లామరస్ గా కనిపించనుందని, హెబ్బా పాత్ర బోల్డ్ గా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. హాట్ సీన్స్ లో హెబ్బా రెచ్చిపోయిందని తెలుస్తోంది. మరి ఈ సినిమా హెబ్బా పటేల్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.