వివేక హత్య కేసులో సిట్‌కు కీలక ఆదేశాలిచ్చిన హైకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యప్తు బృందం(సిట్)కు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ప్రెస్ మీట్లు నిర్వహించొద్దని సిట్‌ను హైకోర్టు ఆదేశించింది.

వివేక భార్య సౌభాగ్యమ్మ సహా వైఎస్ జగన్, అనిల్‌లు దాఖలు చేసిన పిటిషన్లను ఇవాళ హైకోర్టు విచారించింది. సిట్ విచారణపై నమ్మకం లేదని, ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.

అంతే కాకుండా ఎన్నికల సమయంలో సిట్ మీడియా కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ వైఎస్ కుటుంబం పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని హైకోర్టుకు విన్నవించారు.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు సిట్‌కు పై విధంగా ఆదేశాలిచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 28కు వాయిదా వేసింది.