వైసీపీ అభ్యర్థుల పేరుతో పాల్ నామినేషన్లు

ఓటర్లను గందరగోళ పరిచి వైసీపీ ఓట్లను చీల్చేందుకు ప్రజాశాంతి పార్టీ పక్కా స్కెచ్‌ వేసింది. అనంతపురం జిల్లాలో చాలా నియోజక వర్గాల్లోనూ వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న వ్యక్తులతోనే ప్రజాశాంతి పార్టీ నామినేషన్లు వేయించింది. అలా చేయడం ద్వారా ఓటర్లను గందగోళ పరిచేందుకు పాల్ ప్లాన్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 8 నియోజకవర్గాల్లో పాల్‌ ఈ పని చేశారు.

ప్రజాశాంతి పార్టీ తరపున అనంతపురంలో నామినేషన్ వేసిన పగడి వెంకటరామిరెడ్డి టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. ఈయన రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టాలన్న ఉద్దేశంతో టీడీపీ డైరెక్షన్‌లోనే వీరంతా నామినేషన్ వేసినట్టు వైసీపీ ఆరోపిస్తోంది.

    నియోజవకర్గం            వైసీపీ అభ్యర్థి                    ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి

  • రాయదుర్గం           కాపు రామచంద్రారెడ్డి              ఉండాల రామచంద్రారెడ్డి
  • ఉరవకొండ            విశ్వేశ్వరరెడ్డి                       కె. విశ్వనాథ్‌ రెడ్డి
  • అనంతపురం         అనంత వెంకటరామిరెడ్డి             పగడి వెంకటరామిరెడ్డి
  • కల్యాణదుర్గం         ఉషాశ్రీ చరణ్                       ఉషారాణి నేసే
  • రాప్తాడు              తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి              డి. ప్రకాశ్‌
  • పెనుకొండ            ఎం శంకర్‌నారాయణ              ఎస్. శంకర్‌నారాయణ
  • ధర్మవరం            కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి            పెద్దిరెడ్డి వెంకటరామిరెడ్డి
  • కదిరి                 సిద్దారెడ్డి                           సన్నక సిద్దారెడ్డి