ఆ కోరిక అప్పుడు కలిగింది – మహేష్

రీసెంట్ గా తన మైనపు ప్రతిమను ఆవిష్కరించాడు మహేష్ బాబు. ఎవరూ ఊహించని విధంగా ఆ సందర్భంగా ఓ 5 నిమిషాల స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ టైమ్ లో మహర్షి మూవీపై పెద్దగా రియాక్ట్ అవ్వని మహేష్.. తన మైనపు బొమ్మకు సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను మాత్రం బయటపెట్టాడు.

“ఓసారి కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం లండన్ వెళ్లాం. అక్కడ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను సందర్శించాం. అక్కడున్న స్టార్స్ మైనపు విగ్రహాల్ని చూసి గౌతమ్ చాలా ఆనందపడ్డాడు. ఎన్నో విగ్రహాల ముందు నిల్చొని సెల్ఫీలు కూడా దిగాడు.”

గౌతమ్ అలా ఫొటోలు దిగుతుంటే అప్పుడే తనకు కూడా ఓ మైనపు ప్రతిమ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చిందన్నాడు మహేష్. ఇది జరిగిన కొన్నాళ్లకు స్వయంగా మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు నమ్రతకు ఫోన్ చేసి తన ప్రతిమ గురించి అడిగారని చెప్పుకొచ్చాడు.

సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో త్వరలోనే తన మైనపు బొమ్మను పెడతారని, సింగపూర్ ఎవరెళ్లినా తన మైనపు బొమ్మ ముందు సెల్ఫీ దిగి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తనకు ట్యాగ్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు మహేష్.