చంద్రబాబు అలాంటి వాడు అనుకోలేదు అంటున్న వర్మ

ఒకవైపు సీనియర్ నటుడు మోహన్ బాబు ఫీజు రియంబర్స్ మెంట్ అంటూ విద్యార్థులతో కలిసి ధర్నా చేస్తూ చంద్రబాబుని, చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్న సంగతి తెలిసిందే.

మరొకవైపు నందమూరి తారకరామారావు బయోపిక్ అంటూ ఎన్టీఆర్ జీవితం లో నారా చంద్రబాబుని మెయిన్ విలన్ గా చూపిస్తూ రాంగోపాల్ వర్మ ఏకంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి భేటీ అవ్వడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ ఒక ఫొటో ను షేర్ చేశారు. ఆ ఫొటో లో రాంగోపాల్ వర్మ మరియు మోహన్ బాబు ఉన్నారు. “చంద్రబాబు ఇలాంటి వాడు అనుకోలేదు” అంటూ ఫేస్ బుక్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

చూస్తూ ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వర్మ అందరినీ వాడేస్తున్నట్లు కనిపిస్తుంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా మార్చి 29న విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

I never thought Nara Chandrababu Naidu was this b…d ??? F…k ???#LakshmisNTR

Posted by RGV on Monday, 25 March 2019