వైసీపీలో చేరిన మోహన్‌బాబు

నటుడు మోహన్‌ బాబు కూడా వైసీపీలో చేరారు. లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌ను మోహన్‌బాబు కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు.

తన కాలేజీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్నఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము చెల్లించాలని ఇటీవల మోహన్‌బాబు తిరుపతిలో ధర్నా చేశారు. అప్పటి నుంచి టీడీపీ నాయకులు మోహన్‌బాబు కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మోహన్‌బాబు కుటుంబంపై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు.

తనను రెచ్చగొడితే టీడీపీకే ఇబ్బంది అని ఇటీవల మోహన్‌బాబు హెచ్చరించారు. తనను రెచ్చగొడితే చంద్రబాబు చరిత్ర మొత్తం బయటపెడుతానని… నాడు ఎన్టీఆర్‌కు చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తానని మోహన్‌బాబు హెచ్చరించారు.

అయినా మోహన్‌బాబుపై టీడీపీ విమర్శలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు వైసీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.