బిడ్డ ఏడ్చిందని మూతికి ఫెవిక్విక్‌ పెట్టిన తల్లి

శనివారం బీహార్‌ లోని ఛాప్రా నగరంలో జరిగిందీ ఘటన. గంటల తరబడి కొడుకు నిశ్శబ్దంగా ఉండటం, బిడ్డ నోటి నుంచి నురుగు రావడం గమనించి భార్యను ఏమైందని అడిగాడు భర్త.

పొద్దున్నుంచి పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడని, ఆ ఏడుపు తట్టుకోలేక, దాన్ని ఆపడానికి పెదాలకు ఫెవిక్విక్‌‌‌‌‌‌‌‌ పెట్టానని చెప్పింది. భార్య నిర్వాకానికి ఏం మాట్లాడాలో తెలియని ఆ భర్త వెంటనే కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బిడ్డను పరీక్షించిన డాక్టర్లు ప్రస్తుతం పిల్లాడికి ఏం అపాయం లేదని చెప్పారు.