బీజేపీలోకి జితేందర్ రెడ్డి

టీఆర్ఎస్ సీనియర్ నేత, మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీగా ఉన్నా ఈ దఫా ఆయనకు కేసీఆర్ టికెట్ నిరాకరించారు.

మహబూబూబ్‌నగర్ టికెట్‌ను ఏ. శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన జితేందర్ రెడ్డి పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా జితేందర్ రెడ్డి కీలకంగా పని చేశారు. తన పార్లమెంటు పరిధిలోని కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమికి పార్టీ పెద్దలతో కలసి పని చేశారు. అయినా ఆయనకు మొండి చేయి చూపడంతో పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు.

కాగా, ఇప్పటికే మహబూబ్‌నగర్ పార్లమెంటు సీటును బీజేపీ కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణకు కేటాయించారు. ఈ నేపథ్యంలో మరి జితేందర్ రెడ్డిని బీజేపీ ఏ పదవిలో సర్థుబాటు చేస్తుందో వేచి చూడాలి.