నానా పటేకర్ కి తెలుగులో మంచి పాత్ర దొరికిందా?

పరభాషా నటీనటులను తెలుగులో పరిచయం చేసే స్టార్ దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఒకరు. ఈ మాటల మాంత్రికుడు ఇప్పటికే చాలా మంది పరభాష యాక్టర్లను తెలుగు తెరపై తీసుకువచ్చారు. కానీ గత కొంతకాలంగా త్రివిక్రమ్ వారి స్థాయికి తగ్గ పాత్రను ఇవ్వడం లేదని అభిమానులు భావిస్తున్నారు.

ఉదాహరణకు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బొమన్ ఇరానీ పాత్ర ఇలా ఉండబోతోంది… అలా ఉండబోతోంది… అంటూ బోలెడు ఊహాగానాలు బయటకు వచ్చాయి. కానీ ఆ సినిమాలో ఆయన పాత్ర కేవలం కొన్ని సీన్లకు మాత్రమే పరిమితం అయింది.

ఇక ‘అజ్ఞాతవాసి’ సినిమా లో ఖుష్బూ పరిస్థితి కూడా కొంచెం అటు ఇటు గా ఇలాగే ఉంటుంది. ఇక తదుపరి సినిమాలో కూడా త్రివిక్రమ్ మరొక బాలీవుడ్ నటుడిని తెలుగు తెరమీదకి తీసుకురాబోతున్నారు. ఆయన ఎవరో కాదు నానా పటేకర్. నటుడిగా బాలీవుడ్ లో నానాకు మంచి గుర్తింపు ఉంది. ఆయన ఇప్పటిదాకా తెలుగు తెరపై ఎప్పుడూ కనిపించలేదు.

తమిళంలో రెండు సినిమాలు చేసినప్పటికీ అవి మంచి విజయాన్ని సాధించలేకపోయాయి. ఇప్పుడు నానా మొట్టమొదటిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నాడు. త్రివిక్రమ్ నానాకు ప్రత్యేకమైన పాత్ర ఇస్తున్నారా లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.