నామినేషన్ కూడా సరిగా వేయని నారా లోకేష్…. 24 గంటల సమయానికి విజ్ఞప్తి

మంత్రి నారాలోకేష్‌ నామినేషన్ సరిగా వేయలేదు. దీంతో వివాదం రేగింది. గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న లోకేష్‌… నామినేషన్ నోటరి మాత్రం కృష్ణాజిల్లాలో చేయించారు.

దీంతో నామినేషన్‌పై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. తమకు వివరణ ఇచ్చేందుకు 24 గంటల సమయం ఇవ్వాలని లోకేష్‌ తరపు లాయర్లు అధికారులను కోరారు.

అయితే దీనిపై వైసీపీ అభ్యర్థి ఆర్కే అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం పనిచేయాలని కోరారు. అయితే లోకేష్ నామినేషన్‌ను వెంటనే ఆమోదించాలని ప్రభుత్వం పెద్దలు రిటర్నింగ్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.