‘కేజీఎఫ్’ స్టార్ పై మండిపడ్డ నిఖిల్ గౌడ్

ఒకప్పటి నటి సుమలత తన భర్త అంబరీష్ మరణం తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి తనకు టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఇక ఈమెకు కన్నడ నటులు యశ్ మరియు దర్శన్ నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తోంది. ఇద్దరు హీరోలు ఇప్పటికే బహిరంగంగా సుమలత కు మద్దతు పలికారు. అయితే యశ్ మరియు దర్శన్ సుమలత కు మద్దతు పలికినప్పటినుంచి వీరిపై నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి.

మాండ్య నియోజకవర్గం నుండి సుమలత తో పాటే కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ్ కూడా ఎన్నికల బరిలో దిగనున్నారు. ఒక సందర్భంలో తను మరియు దర్శన్, సుమలత కోసం ఎడ్లబండి ఎడ్ల లాగా కష్టపడి పని చేస్తామని అన్నారు యశ్.

ఈ నేపథ్యంలో నిఖిల్ గౌడ్ మాట్లాడుతూ దర్శన్ మరియు యశ్ బుద్ధిలేని ఎద్దులని, వారికి ఒక రైతు పడే కష్టం తెలియదని, వాళ్లు పొలాన్ని దున్నడం పక్కనపెడితే నాశనం చేస్తారని అన్నారు.

అంతేకాక మాండ్యలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో వారు ఏం చేశారు అంటూ నిలదీశారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సహజమే. అందుకే యశ్ కూడా ఈ మాటలను పెద్దగా పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ రెండవ భాగం షూటింగ్ లో బిజీగా ఉన్నారు యశ్.