మమ్మల్ని గెలిపించండి… మేం అండగా ఉంటాం – బహిరంగ సభలో టీడీపీకి పవన్‌ పిలుపు

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను ఎటువైపో స్పష్టంగా చెప్పేశారు. టీడీపీతో లోపాయికారిగా సీట్లు సర్ధుబాటు చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో… ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అభ్యర్థులకు టీడీపీ వాళ్లు మద్దతు ఇవ్వాలని పవన్‌ కల్యాణ్ కోరారు. అలా చేస్తే టీడీపీకి అండగా ఉంటామన్నారు.

పవన్‌ కల్యాణ్ ఏమన్నారు అన్నది ఆయన మాటల్లోనే ” టీడీపీ గెలవాలనుకుని మద్దతు ఇచ్చాం. ఆత్మగౌరవాన్ని, ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో బయటకు వచ్చాం. తెలుగుదేశం కూడా జనసేనకు మద్దతు పలకాలని మనస్పూర్తిగా కోరుతున్నా. టీడీపీ నాయకులు ఈసారి జనసేనకు మద్దతు పలకండి మీకు అండగా ఉంటా. మీరు ఏమీ చేయలేకపోయినప్పుడే నేను అండగా ఉన్నా” అని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

జనసేన బలహీనంగా ఉన్న చోట టీడీపీకి మద్దతు ఇచ్చి… జనసేనకు అవకాశాలు ఉన్న చోట టీడీపీ వాళ్లు జనసేనకు మద్దతు ఇవ్వాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌ కోరిన విషయం స్పష్టమైంది.