నాగార్జున సినిమాకోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన హీరోయిన్

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమా డిజాస్టర్ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు.

ఈ మధ్యనే డబ్బింగ్ సినిమా ‘దేవ్’ తో తెలుగు ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా నాగార్జున మన్మధుడు సీక్వెల్ ‘మన్మధుడు 2’ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ కి అవకాశం అందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అధికారికంగా లాంచ్ కూడా అయింది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

అయితే రకుల్ కు గత కొంతకాలంగా తెలుగు ఆఫర్లు లేనప్పటికీ ఈ సినిమా కోసం మాత్రం రకుల్ చాలా పెద్ద మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలకు హీరోయిన్ల ను తీసుకు రావడం కొంచెం కష్టమైన పని. కొత్త హీరోయిన్లు అంటే వయసు తక్కువగా ఉంటుంది కాబట్టి వారు జత కట్టలేరు.

ఇక కాజల్, తమన్నా, నయనతార లాంటి స్టార్ హీరోయిన్లను తీసుకుంటే రొటీన్ అయిపోతుంది. పైగా కథ ప్రకారం ఒక స్టార్ హీరోయిన్ అయితేనే సినిమా బాగుంటుందని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని రకుల్ ప్రీత్ బాగానే క్యాష్ చేసుకుంది.

మామూలుగా ఒక సినిమా కోసం కోటి రూపాయల వరకు డిమాండ్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు ‘మన్మధుడు 2’ సినిమా కోసం ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటోందని సమాచారం. అయితే తెలుగులో అవకాశాలు లేవు అనుకుంటున్న సమయంలో రకుల్ కి ఇలాంటి అవకాశం దొరకడం గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.