సీతకు టైమ్ దొరకడం లేదంట

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సీత. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు కూడా. కానీ ఇప్పుడీ సినిమా చెప్పిన టైమ్ కు వచ్చేలా లేదు. అవును.. సీత సినిమా రిలీజ్ వాయిదాపడే సూచనలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి మరో భారీ ఎపిసోడ్ షూటింగ్ ఒకటి పెండింగ్ లో ఉందట. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా నత్తనడకన సాగుతోంది. కాబట్టి ఎట్టిపరిస్థితిల్లో ఏప్రిల్ 25కి సీత సినిమా వచ్చే అవకాశం లేదంటోంది ట్రేడ్. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రాబోతోంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయింది. బెల్లంకొండ మార్కెట్ కంటే 30శాతం ఎక్కువకే బయ్యర్లు కొన్నారు. మరోవైపు శాటిలైట్ డీల్ కూడా క్లోజ్ అయింది. అంతలోనే సినిమా వాయిదా అంటూ వస్తున్న పుకార్లు డిస్ట్రిబ్యూటర్లను టెన్షన్ పెడుతున్నాయి.