‘సూర్యకాంతం’ గా మారిపోయిన నిహారిక

వరుసగా ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే డిజాస్టర్ లను అందుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే కసితో ‘సూర్యకాంతం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. నిహారిక నటించిన ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్న కూచి’ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఇప్పటికే టీజర్ తో ప్రేక్షకులను మెప్పించిన ‘సూర్యకాంతం’ ఇప్పుడు ట్రైలర్ తో మన ముందుకు వచ్చింది.

ట్రైలర్ చూస్తేనే సినిమా చాలా ఫన్నీ గా ఉండబోతోందని తెలుస్తోంది. హీరో అభి పూజ మరియు సూర్యకాంతం తో ప్రేమలో పడతాడు. సూర్యకాంతం గురించి పూజకి తెలుసు కానీ పూజ గురించి కాంతానికి తెలియదు. మరి వీరిద్దరిలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది కథ అని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కామెడీ హైలైట్ గా మారనుందని అర్థం అవుతోంది. మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ కాబోతోంది. ఇక ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుతోంది. నిర్వాణ సినిమాస్ పతాకంపై సందీప్ ఎర్రంరెడ్డి ఈ సినిమా ను నిర్మించారు. ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది.