టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

విజయనగరం జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్దన్‌ ధాట్రాజ్‌కు షాక్ తగిలింది. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. జనార్దన్‌ థాట్రాజ్ టీడీపీ తరపున నామినేషన్ వేయగా… నామినేషన్ల పరిశీలన సమయంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అభ్యంతరం తెలిపారు. జనార్ధన్‌ అసలు ఎస్టీ కాదని వివరించారు.

జనార్దన్ ఎస్టీ కాదని గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టులు ఇచ్చిన తీర్పు కాపీలను ఎన్నికల అధికారులకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థి అందజేశారు. వాటిని పరిశీలించిన అధికారులు జనార్దన్ ఎస్టీ కాదన్న ఉద్దేశంతో అతడి నామినేషన్‌ను తిరస్కరించింది. పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థికి మద్దతు పలికేందుకు టీడీపీ పరిశీలన చేస్తోంది.