Telugu Global
NEWS

ఈసీకి పరిధి విధిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన జీవో

ఇప్పటికే సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించిందిన చంద్రబాబు నాయుడు… ఇప్పుడు మరో స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘంతోనూ వివాదానికి దిగారు. వివాదాస్పద ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా దాన్ని ధిక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈసీ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ తొలుత జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఆ జీవోను రద్దు చేసింది. ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని నిలిపివేస్తూ […]

ఈసీకి పరిధి విధిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన జీవో
X

ఇప్పటికే సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించిందిన చంద్రబాబు నాయుడు… ఇప్పుడు మరో స్వతంత్ర సంస్థ ఎన్నికల సంఘంతోనూ వివాదానికి దిగారు.

వివాదాస్పద ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా దాన్ని ధిక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈసీ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ తొలుత జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా ఆ జీవోను రద్దు చేసింది. ఏబీ వెంకటేశ్వర రావు బదిలీని నిలిపివేస్తూ జీవో 720ని విడుదల చేసింది. ఈసీకి పరిమితులు విధిస్తూ మరో జీవో 721ను విడుదల చేసింది.

ఇంటెలిజెన్స్ చీఫ్‌ను ఎన్నికల సంఘం పరిధి నుంచి తప్పిస్తూ జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కేవలం ఇద్దరు
ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ జీవో ఇచ్చారు. దీన్ని ఒక సంచలన నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల వేళ ఈసీ పరిధిలో అధికారులు పనిచేయాల్సి ఉంటుంది.

గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ పై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ స్పందించి అప్పటి డీజీపీ యాదవ్ ను పక్కన పెట్టి ఎన్నికలయ్యేవరకు మహంతిని డీజీపీగా నియమించింది. మూడునెలల క్రితం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను ఎన్నికల విధుల నుంచి తొలగించింది. అయితే ఇప్పుడు విచిత్రంగా చంద్రబాబు ఈసీ నిర్ణయాన్ని కూడా తప్పుబట్టడం చూసి ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈసీకి కూడా పరిధి విధిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

First Published:  27 March 2019 6:39 AM GMT
Next Story