Telugu Global
National

రైల్వే శాఖ, ఎయిరిండియాకు ఎన్నికల సంఘం నోటీసులు

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రైల్వే, ఎయిరిండియాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ రెండు సంస్థలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలకు ఈ నోటీసులు పంపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా ఆయా సంస్థలు జారీ చేసే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను ఎందుకు ముద్రిస్తున్నారో తెలపాలంటూ ఈ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాటిపై రాజకీయ పార్టీల నేతలు, […]

రైల్వే శాఖ, ఎయిరిండియాకు ఎన్నికల సంఘం నోటీసులు
X

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రైల్వే, ఎయిరిండియాకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ రెండు సంస్థలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖలకు ఈ నోటీసులు పంపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో కూడా ఆయా సంస్థలు జారీ చేసే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలను ఎందుకు ముద్రిస్తున్నారో తెలపాలంటూ ఈ నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాటిపై రాజకీయ పార్టీల నేతలు, గుర్తులు ముద్రించి ప్రచారం చేసుకోవడం చట్ట విరుద్దమని.. ప్రభుత్వ భవనాలపై కూడా సంక్షేమ పథకాలను ప్రచారం చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలు ఉల్లఘిస్తూ టికెట్లపై ఎందుకు నరేంద్ర మోడీ చిత్రాలు ముద్రించారో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

ఈ నెల 10న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికి కోడ్ వచ్చి రెండు వారాలు దాటినా.. ఎయిరిండియా, రైల్వే టికెట్లపై నరేంద్ర మోడీ చిత్రాలు ముద్రించిన టికెట్లు అమ్ముతోంది. ఈ విషయంపై పలు పిర్యాదులు సీఈసీకి అందాయి. దీంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే ఎయిరిండియా మాత్రం ప్రధాని ఫొటో ముద్రించిన టిక్కెట్లను జారీ చేయడం ఆపివేసింది.

First Published:  27 March 2019 6:30 AM GMT
Next Story