Telugu Global
Health & Life Style

ఇలా చేయండి... ఆరోగ్యం మీ వెంటే...

నియమాలు మనుషులకే కాదు… శరీరానికీ ఉంటాయి. అదేమిటీ… మనుషులు వేరు… శరీరాలు వేరు  అనుకుంటున్నారా? నిజమే… రెండిటికి సంబంధం లేదు. మనిషి నియమాలు మనిషివైతే… శరీర ధర్మాలు శరీరానివి. ప్రతి శరీరం సమయానుకూలంగా వ్యవహరిస్తుందని వైద్య శాస్త్రం చెబుతోంది. ఆ సంగతి ఏమిటో చూద్దాం. శరీరం తన ధర్మాన్ని అనుసరించి ఏ సమయానికి ఏం చేయాలి… ఎలా చేయాలి… అన్న విషయాలను క్రమం తప్పకుండా పాటిస్తుంది. శరీరంలో కొన్ని అవయవాలు కొన్ని సమయాల్లో మాత్రమే యాక్టివ్ గా […]

ఇలా చేయండి... ఆరోగ్యం మీ వెంటే...
X

నియమాలు మనుషులకే కాదు… శరీరానికీ ఉంటాయి. అదేమిటీ… మనుషులు వేరు… శరీరాలు వేరు అనుకుంటున్నారా? నిజమే… రెండిటికి సంబంధం లేదు. మనిషి నియమాలు మనిషివైతే… శరీర ధర్మాలు శరీరానివి. ప్రతి శరీరం సమయానుకూలంగా వ్యవహరిస్తుందని వైద్య శాస్త్రం చెబుతోంది. ఆ సంగతి ఏమిటో చూద్దాం.

శరీరం తన ధర్మాన్ని అనుసరించి ఏ సమయానికి ఏం చేయాలి… ఎలా చేయాలి… అన్న విషయాలను క్రమం తప్పకుండా పాటిస్తుంది. శరీరంలో కొన్ని అవయవాలు కొన్ని సమయాల్లో మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తాయి.

శరీర ధర్మానికి అనుగుణంగా మానవులు వ్యవహరిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవంటున్నారు వైద్య నిపుణులు. ఏ అవయువాలు ఏ సమయాల్లో ఎంత చురుకుగా పనిచేస్తాయో తెల్సుకుందాం…

  • ఉదయం 5 నుంచి 7 గంటల వరకూ మలినాలు బయటకు వెళ్లే సమయం. ఈ సమయంలో పెద్దపేగు చాలా చురుకుగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ నీరు తాగాలి. రన్నింగ్, సైక్లింగ్, యోగా వంటివి చేస్తే ఎటువంటి ఒత్తిడి లేకుండా మలినాల విసర్జన జరుగుతుంది.
  • మలినాల విసర్జన తర్వాత శరీరానికి శక్తినిచ్చే ప్రొటీన్లు, కొవ్వు పదార్దాలు, పోషకాలు అవసరం చాలా ఉంటుంది. అందుకే వ్యాయామం అనంతరం ఉదయం 8 నుంచి 9 గంటల లోపు అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
  • ఉదయం 9 గంటల తర్వాత ఆహారంలో ఉన్న పోషకాలను, ఇతర పదార్దాలను శరీరం తీసుకుంటుంది. ఈ సమయంలో లివర్ చాలా చురుగ్గా పని చేస్తుంది.
  • ఉదయం 11 గంటల తర్వాత గుండె శరీరంలో ఇతర భాగాలకు రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేస్తుంది. అంటే ఈ సమయంలో గుండె చాలా చురుగ్గా ఉంటుందన్న మాట.
  • మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతానికి శరీరంలో ఉన్న ఇతర భాగాలకు పోషకాలు చేరిపోవడంతో, మళ్లీ శరీరానికి కొత్త శక్తి అవసరం అవుతుంది. అందుకు ఈ సమయంలో ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
  • మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరు ఎక్కువగా తాగితే ఎటువంటి ఒత్తిడి లేకుండా మలినాలు బయటకి వెళతాయి.
  • రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపు ఎట్టి పరిస్థితులోనూ భోజనం కాని అల్పాహారం కాని తీసుకోవాలి. ఈ సమయంలో మెదడు చాలా చురుగ్గా ఉంటుంది.
  • రాత్రి 9 గంటల తర్వాత శరీరం, మెదడు విశ్రాంతి కోరుకుంటాయి. ఈ సమయంలో హాయిగా నిద్రపోవాలి.
  • రాత్రి 11 తర్వాత జీర్ణవ్యవస్ధ చాలా అలర్ట్ గా ఉంటుంది. మనం తిన్న పదార్దాలు జీర్ణం చేయడంలో జీర్ణాశ్రయం చాలా చురుకుగా పనిజేస్తుంది. ఈ సమయంలో నిద్రపోకుండా… మేలుకుని ఉంటే శరీరంలో జీర్ణక్రియ చురుగ్గా పనిచేయదు. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన మలినాలు కూడా బయటకి వెళ్లవు.

ఇలా శరీరంలో ప్రతి అవయవం కూడా తన కాలధర్మాన్ని అనుసరించే పని చేయడం, నిలిపివేయడం వంటివి సహజసిద్ధంగా చేస్తూ ఉంటాయి. ఆ ధర్మాలకు అడ్డు తగిలితేనే మనిషి అనారోగ్యం పాలవుతారు. ఈ విషయాన్ని గ్రహించి శరీర ధర్మానికి అనుగుణంగా వ్యాయామం, ఆహార నియమాలు, నిద్ర పోవడం వంటి సమయానుకూలంగా చేయడం ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు. ఇక నుంచి అలా చేసేద్దామా…!

First Published:  26 March 2019 9:00 PM GMT
Next Story