Telugu Global
Cinema & Entertainment

'మహర్షి' లోని చోటి చోటి బాతే....

ఈ మధ్యనే ‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన కెరియర్ లోనే 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహర్షి’ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా సినిమా అప్ డేట్స్ గురించి […]

మహర్షి లోని చోటి చోటి బాతే....
X

ఈ మధ్యనే ‘భరత్ అనే నేను’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన కెరియర్ లోనే 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మహర్షి’ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. గత కొంతకాలంగా సినిమా అప్ డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఒక శుభవార్త అని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే మహర్షి సినిమాలోని మొదటిపాట విడుదల చేయనున్నారు. ఒక పోస్టర్ ద్వారా ‘మహర్షి’ సినిమా లోని మొదటి పాట అయిన ‘చోటి చోటి బాతే’ పాటను మార్చి 29న ఉదయం 9గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

మొదటి పాట ఎలా ఉండబోతోందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. పోస్టర్ లో మహేష్, పూజ హెగ్డే, అల్లరి నరేష్ సముద్రపు అలలను చూస్తూ కనిపిస్తారు. పోస్టర్ చూస్తుంటే ఇది వారి స్నేహానికి సంబంధించిన పాట అని అనుకోవచ్చు. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.

First Published:  27 March 2019 12:50 AM GMT
Next Story