Telugu Global
Cinema & Entertainment

ధనుష్ సినిమాలో విలన్ గా మారిన నవీన్ చంద్ర

‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొక వైపు విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈమధ్యనే ‘దేవదాస్’, ‘అరవింద సమేత’ సినిమాలలో నవీన్ నెగటివ్ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు అందుకుంటున్నాడు నవీన్. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘అసురన్’ లో నవీన్ చంద్రకు విలన్ గా చేసే అవకాశం వచ్చిందట. వెట్రిమారన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ […]

ధనుష్ సినిమాలో విలన్ గా మారిన నవీన్ చంద్ర
X

‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొక వైపు విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఈమధ్యనే ‘దేవదాస్’, ‘అరవింద సమేత’ సినిమాలలో నవీన్ నెగటివ్ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు అందుకుంటున్నాడు నవీన్.

తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘అసురన్’ లో నవీన్ చంద్రకు విలన్ గా చేసే అవకాశం వచ్చిందట. వెట్రిమారన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని వీ క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు.

తాజాగా తమిళ నాడులో జరుగుతున్న ఒక చిత్ర షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు నవీన్. ఆ ఫొటోలు ధనుష్ సినిమా షూటింగ్ లో తీసినవే అని కొందరు అంటున్నారు.

తమిళ చిత్రాల్లో నటించడం నవీన్ కు ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే చాలా తమిళ సినిమాల్లో కనిపించాడు. కానీ ధనుష్ లాంటి స్టార్ తో సినిమా కాబట్టి కచ్చితంగా తమిళ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడని ఫ్యాన్స్ నమ్మకం. ఇక తెలుగు సినిమాల గురించి చెప్పాలంటే నవీన్ హీరోగా నటిస్తున్న ‘హీరో హీరోయిన్’, ’28 డిగ్రీ సెల్సియస్’ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి.

Met this beauty today on sets ?❤️

Posted by Naveen Chandra on Tuesday, 26 March 2019

First Published:  27 March 2019 5:42 AM GMT
Next Story