Telugu Global
International

భారత్ దాడి చేసిన చోట్ల ఉగ్ర శిబిరాలే లేవు : పాకిస్తాన్ రివర్స్ అటాక్

పుల్వామాలో గత నెలలో జరిగిన ఉగ్రవాద దాడిలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాన్లు భారీగా మరణించారు. ఆ దాడికి కారణం పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ అని భారత్ ఆధారాలను పాకిస్తాన్‌కు సమర్పించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14 ఉగ్రదాడికి ప్రతీకారంగా పీవోకేలోని ఉగ్రశిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసింది. 300 మంది మరణించారని.. పదుల సంఖ్యలో ఉగ్రశిబిరాలు ధ్వంసం అయ్యాయని వార్తలు […]

భారత్ దాడి చేసిన చోట్ల ఉగ్ర శిబిరాలే లేవు : పాకిస్తాన్ రివర్స్ అటాక్
X

పుల్వామాలో గత నెలలో జరిగిన ఉగ్రవాద దాడిలో సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాన్లు భారీగా మరణించారు. ఆ దాడికి కారణం పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ అని భారత్ ఆధారాలను పాకిస్తాన్‌కు సమర్పించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 14 ఉగ్రదాడికి ప్రతీకారంగా పీవోకేలోని ఉగ్రశిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసింది. 300 మంది మరణించారని.. పదుల సంఖ్యలో ఉగ్రశిబిరాలు ధ్వంసం అయ్యాయని వార్తలు వెలువడ్డాయి. అయితే అసలు ఎలాంటి ఉగ్రశిబిరాలు అక్కడ లేవని.. భారత వైమానిక దళం అడవుల్లోని చెట్లను కూల్చేసి వెళ్లిందని పాకిస్తాన్ వాదిస్తోంది.

అయితే పాకిస్తాన్‌కు చెందిన జైషే చేసిన కుట్రలకు సంబంధించిన కీలక పత్రాలను భారత ప్రభుత్వం పాకిస్తాన్ తాత్కాలిక హైకమిషనర్‌కు అందించింది.

దీంతో పాకిస్తాన్ రివర్స్ ఎటాక్‌కు దిగింది. భారత్ సమర్పించిన పత్రాల ఆధారంగా దర్యాప్తు చేశామని.. చాలా మంది అనుమానితులను విచారించామని పాకిస్తాన్ చెబుతోంది.

భారత్ పేర్కొన్న 22 ప్రాంతాల్లో పరిశోధన చేశామని.. మా పరిశీలనలో అసలు అక్కడ ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు కనపడలేదని చెబుతోంది. అవసరం అయితే భారత అధికారులు కూడా వచ్చి చూడవచ్చని.. అందుకు అవసరమైన అనుమతి ఇచ్చేందుకు పాకిస్తాన్ సుముఖంగా ఉందని ఆ దేశ విదేశాంగశాఖ ప్రకటించింది.

First Published:  28 March 2019 2:30 AM GMT
Next Story