Telugu Global
Cinema & Entertainment

దర్శకుడిని పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి?

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ తరువాత ‘ఎంసీఏ’ తో హిట్ అందుకున్న ఈమె ‘కణం’ సినిమాలో నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్యనే వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అయితే సినిమాల పరంగా కాకుండా ఈమె ఇప్పుడు వ్యక్తిగత జీవితం వలన వార్తల్లోకెక్కింది. గత కొంతకాలంగా సాయి పల్లవి […]

దర్శకుడిని పెళ్లి చేసుకోబోతున్న సాయి పల్లవి?
X

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ తరువాత ‘ఎంసీఏ’ తో హిట్ అందుకున్న ఈమె ‘కణం’ సినిమాలో నటించింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మధ్యనే వచ్చిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.

అయితే సినిమాల పరంగా కాకుండా ఈమె ఇప్పుడు వ్యక్తిగత జీవితం వలన వార్తల్లోకెక్కింది. గత కొంతకాలంగా సాయి పల్లవి ఒక తమిళ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది అంటూ కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. ఆ తమిళ దర్శకుడు ఎవరో కాదు ఏఎల్ విజయ్. తమిళంలో సాయిపల్లవి మొదటి చిత్రం అయిన ‘దియా’ (తెలుగులో ‘కణం’) చిత్రానికి దర్శకత్వం వహించాడు ఏఎల్ విజయ్.

ఇతడితో సాయి పల్లవి స్నేహం ప్రేమగా మారిందని వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయమై వీరిద్దరిలో ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఇంతకుముందు హీరోయిన్ అమలాపాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి బంధం ఎక్కువకాలం నిలవలేదు. 2017లో వారు విడాకులు తీసుకుని విడిపోయారు. మరోవైపు సాయి పల్లవి తాను జీవితంలో పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులను చూసుకుంటూ వారితోనే ఉండిపోతానని చెబుతోంది. మరి తమిళ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  27 March 2019 9:08 PM GMT
Next Story