Telugu Global
Cinema & Entertainment

"లక్ష్మీ'స్‌ ఎన్టీఆర్‌" సినిమా రివ్యూ

రివ్యూ: లక్ష్మీ’స్‌ ఎన్టీఆర్‌ రేటింగ్‌: 2.75/5 తారాగణం: విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ రాజ్ తదితరులు సంగీతం: కల్యాణీ మాలిక్‌ నిర్మాత: రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి దర్శకత్వం: రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. సంచలనాలకు మారు పేరు అయిన రామ్ గోపాల్ వర్మ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఇది. బాలకృష్ణ నిర్మించిన రెండు ఎన్టీఆర్ బయోపిక్ ల కన్నా తన ఈ […]

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా రివ్యూ
X

రివ్యూ: లక్ష్మీ’స్‌ ఎన్టీఆర్‌
రేటింగ్‌: 2.75/5
తారాగణం: విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ రాజ్ తదితరులు
సంగీతం: కల్యాణీ మాలిక్‌
నిర్మాత: రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి
దర్శకత్వం: రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజు

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. సంచలనాలకు మారు పేరు అయిన రామ్ గోపాల్ వర్మ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసిన చిత్రం ఇది. బాలకృష్ణ నిర్మించిన రెండు ఎన్టీఆర్ బయోపిక్ ల కన్నా తన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది అని వర్మ ముందు నుంచే చెప్తూ వచ్చాడు.
ఎన్టీఆర్ జీవితం లో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన దగ్గర నుండి ఆయన కి జరిగిన సత్కారాలు, అవమానాలు, అసలు ఆయన జీవితం ఎలా సాగింది అనే విషయాలని వర్మ ఈ సినిమాలో చెప్పదలచాడు.

ఇప్పటికే పలు వివాదాలను దాటుకుని ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా ఈరోజు విడుదల కాలేదు. ఈ విషయమై వర్మ సుప్రీం కోర్టు ని అప్రోచ్ కానున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ:

1989 లో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) ఒంటరి గా బతుకుతున్న సమయం లో లక్ష్మీ పార్వతి (యజ్ఞ శెట్టి) తన జీవితం లోకి వస్తుంది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతి పూనుకొని ఎన్టీఆర్ అనుమతి కోరుతుంది. అలా మెల్లగా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కి దగ్గర అవుతుండడంతో వారి సంబంధం పైన దుష్ప్రచారం జరుగుతుంది.

అంతలోనే మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఎన్టీఆర్‌ ప్రకటిస్తాడు. ఎన్టీఆర్‌ అల్లుడు బాబు రావ్‌ కి ఇది నచ్చదు. మెల్లగా ఎన్టీఆర్ కుటుంబాన్ని తన వైపుకు తిప్పుకుని ఎన్టీఆర్ తిరిగి అధికారం లోకి వచ్చాక ఎలా ఎన్టీఆర్ కి వ్యతిరేకముగా వెళ్లాడు అనేది సినిమా కథ.

నటీ నటులు:

విజయ్ కుమార్ అనే థియేటర్ నటుడు ఎన్టీఆర్ పాత్ర ని పోషించాడు. అలాగే ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమ లో ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఆహార్యం.. అన్నీ బాగా కుదిరాయి. ఎన్టీఆర్ లాగా నే నటించి అందరినీ మెప్పించాడు.

లక్ష్మీ పార్వతి గా నటించిన యజ్ఞ శెట్టి కి ఇది తొలి తెలుగు చిత్రం. ఆవిడ కూడా బాగా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ తో చేసిన సన్నివేశాలు అన్నీ బాగా వచ్చాయి. వీరిద్దరూ సినిమా కి ఆయువు పట్టు. ఇక బాబు రావ్ గా చేసిన శ్రీ రాజ్ కూడా అలరించి అందరినీ మెప్పించాడు. మిగిలిన నటీ నటులు కూడా చక్కగా చేశారు.

సమీక్ష:

అంతా అనుకున్నట్లు ఈ సినిమా లో వర్మ.. లక్ష్మీ, ఎన్టీఆర్ జీవితం లోకి వచ్చాక జరిగిన దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తాను నమ్మిన నిజాన్ని వర్మ ఈ చిత్రం లో చూపించాడు. చాలా మటుకు తెలిసిన విషయాలే ఉన్నప్పటికి ఇప్పటి తరానికి ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం జరిగింది అనేది వాస్తవికంగా ఆవిష్కరించడంలో వర్మ సక్సెస్ అయ్యాడు.

ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్ళను సైతం మెప్పించేలా సాధ్యమైనంత బలమైన ఎమోషన్స్ తో ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల పాత్రలు మలిచిన తీరు అభినందనీయం.

బయోపిక్ అంటే కేవలం పొగడ్తలే కాదు ఇలా సత్యాలను నగ్నంగా చూపించవచ్చని ఋజువు చేసిన వర్మ కోసం కాకపోయినా ఓ మహనటుడి రాజకీయ ప్రస్థానంలోని చివరి మజిలీని వెండితెరపై చూసేందుకైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

First Published:  29 March 2019 4:00 AM GMT
Next Story