‘ఏపీ ప్రజలు జగన్‌ని సీఎం చేయడాని కంటే ముందు రాక్‌స్టార్‌ని చేశారు’

వైఎస్ జగన్, వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నేరుగా రంగంలోనికి దిగకపోయినా తన సంస్థ తరపున ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ కావలసిన సలహాలు జగన్‌కు పీకే అందిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడూ ట్విట్టర్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ కిశోర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అందులో ఇలా రాశారు.. ” ఏపీ ప్రజలు సోదరుడు వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికంటే ముందే ఒక రాక్‌స్టార్‌ను చేశారని” పోస్ట్ చేశారు. అలా చేయడానికి కారణం జగన్ ఎన్నికల ప్రచార కోసం రూపొందించిన పాట.

‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే పాటకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సాధారణంగా సినిమా పాటలకు కూడా అన్ని వ్యూస్ రావడం కష్టం. అలాంటిది ఒక పార్టీ ఎన్నికల ప్రచార పాటకు అంత ఆదరణ రావడంతో వైఎస్ జగన్‌ను రాక్‌స్టార్‌గా అభివర్ణించారు.

ఇక అదే ట్వీట్‌లో సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. సర్‌జీ నన్ను తిట్టనందుకు ముందస్తు ధన్యవాదాలు అంటూ సెటైర్లు విసిరారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.