కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి పోటీ చేస్తుండగా.. కేరళలోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.

దక్షిణాదిలో కాంగ్రెస్‌ను తిరిగి బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జవాలా మీడియాకు తెలిపారు. రాహుల్‌ను పోటీ చేయమని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు విజ్ఞప్తి చేసినా ఆయన కేరళ నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపారు.

కాగా, రాహుల్ రెండు చోట్ల పోటీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శలు గుప్పించారు. యూపీలో ఓడిపోతాననే భయంతోనే కేరళ పారిపోయారని ఎద్దేవా చేశారు. అయితే మేనకా గాంధీ మాత్రం భిన్నంగా స్పందించారు. రెండు చోట్ల పోటీ చేస్తే భయపడ్డారని తనకెలా తెలుస్తుంది.. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఆమె అన్నారు.