షర్మిల ఉంగరం లాగేసిన దొంగ

వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారంలో ఒక దొంగ చేతివాటం చూపించాడు. తాడేపల్లిలో రోడ్‌ షో నిర్వహించిన షర్మిల… స్థానికులకు అభివాదం చేస్తూ చేయి బస్సులో నుంచి బయటకు పెట్టారు.

ఇంతలో ఒక దొంగ ఆమె చేయిని గట్టిగా పట్టుకుని ఉంగరం లాగేశాడు. షర్మిల చేయిని వెనక్కు తీసుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. దొంగ ఉంగరం లాగేశాడు.

అక్కడే కొందరు ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. తన ఉంగరం దొంగ లాగేసిన తర్వాత ఆ విషయాన్ని గమనించిన షర్మిల… నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.