Telugu Global
NEWS

పచ్చ పత్రిక అచ్చేసిన సర్వే ఫేక్.... స్పష్టం చేసిన లోక్‌నీతి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వైపు ఓటర్లను తిప్పాలని ఆయన అనుకూల మీడియా పడరాని పాట్లు పడుతోంది. ప్రతీ రోజు అబద్దపు రాతలతో ఓటరు మనస్సును మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే ఇవాళ ఒక టీడీపీ అనుకూల పత్రిక టీడీపీదే గెలుపు.. వైసీపీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావు…. ఇది లోక్‌నీతి- సీఎస్‌డీఎస్ సర్వే అంటూ ఫ్రంట్ పేజీలో ఒక వార్తను రాసింది. అసలు బాబును ఎందుకు కావాలనుకుంటున్నారో తెలుసా? అంటూ తన పైత్యాన్నంతా ఆ […]

పచ్చ పత్రిక అచ్చేసిన సర్వే ఫేక్.... స్పష్టం చేసిన లోక్‌నీతి
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు వైపు ఓటర్లను తిప్పాలని ఆయన అనుకూల మీడియా పడరాని పాట్లు పడుతోంది. ప్రతీ రోజు అబద్దపు రాతలతో ఓటరు మనస్సును మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంది. అలాగే ఇవాళ ఒక టీడీపీ అనుకూల పత్రిక టీడీపీదే గెలుపు.. వైసీపీకి గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావు…. ఇది లోక్‌నీతి- సీఎస్‌డీఎస్ సర్వే అంటూ ఫ్రంట్ పేజీలో ఒక వార్తను రాసింది.

అసలు బాబును ఎందుకు కావాలనుకుంటున్నారో తెలుసా? అంటూ తన పైత్యాన్నంతా ఆ వార్తలో చూపించింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 135 సీట్ల దాకా గెల్చుకుంటుందని ఆ సర్వేలో తేలిందని ఆ పత్రిక రాసింది.

అయితే ఈ వార్త ఫేక్ అని.. తాము ఏపీలో ఎలాంటి సర్వే చేయలేదని ‘లోక్‌నీతి – సీఎస్‌డీఎస్’ తమ అధికార ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ ఒక్క ట్వీట్‌తో ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ప్రతీ రోజూ పచ్చ మీడియా రాసే రాతలలో కొంచమైనా సత్యముందేమో అని ఏదో మూల ఆశ ఉన్న నాయకులు కూడా ఇవాళ రాసిన బ్లండర్ సర్వే వార్తతో డీలా పడిపోయారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు ఇలాంటి ఫేక్ సర్వేలతో లాభమేం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి వార్తల వల్ల ప్రజల్లో ఇంకా చులకన అవడం తప్ప మరేమీ ఒరిగేది ఉండదని.. క్షేత్ర స్థాయిలో ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో ప్రతీ రోజూ తెలుస్తుంటే.. ఇలాంటి అబద్దపు వార్తలు ఎలా రాస్తారని స్వపక్షమే గుసగుసలాడుకుంటోంది.

కాగా, ఈ సర్వే పేరుతో ఆ పత్రిక ఏం రాసిందంటే.. టీడీపీ 126 నుంచి 135 స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీకి 45 నుంచి 50 సీట్లు…. జనసేనకు 2 నుంచి 5 ఎమ్మెల్యే సీట్లు… మాత్రమే వస్తాయని పేర్కొంది. టీడీపీ ఏకంగా 22 వరకు లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని.. వైసీపీకి 3 నుంచి 5… అంటూ రాసుకుంది. ఈ సారి ఓట్ల శాతంలో కూడా భారీ తేడా ఉంటుందని.. టీడీపీకి 46.2 శాతం వస్తే…. వైసీపీకి 37.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పింది.

ఇక, ఇది ఏప్రిల్ ఫూల్ సర్వేనే అని సొంత పార్టీ నేతలే తమ సన్నిహితుల వద్ద మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారట.

First Published:  1 April 2019 12:49 AM GMT
Next Story