రాగులతో… పోతాయిలే రోగాలు…

రాగులు… కొన్ని ప్రాంతాలలో చోళ్లు అని కూడా అంటారు.  చిరుధాన్యాలన్నింటిలోనూ  రాగులుకి ” ది బెస్ట్” అని పేరు. వీటిని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలన్నిస్తాయి.  అంటే రాగి జావా, రాగి సంగటి, రాగి దోశ, రాగి లడ్డు, రాగి రొట్టి ఇలా  ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

  • రాగి పిండిని జావలా చేసుకుని.. పాలతోనైనా, మజ్జిగాతోనైనా తీసుకోవచ్చు. 
  • చిన్నపిల్లలకు పాలతో ఇస్తే ఎంతో బలం.
  • డ్రైఫ్రూట్స్ లో ఉన్న అనేక గుణాలు ఒక్క రాగులలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
  • రాగులలో కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలు చాల  ఉన్నాయి. అందువల్ల ఇవి ఎముకలకు, కండరాలకు, దంతాలకు బలాన్ని ఇస్తాయి.
  • ఎసిడిటీ….. ఉన్నవారికి రాగి జావ అధ్బుత ఔషధం.
  • వేసవిలో ఉదయాన్నే రాగి జావ తీసుకుంటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
  • రాగులలో కాల్షియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల మల బద్దకం, అజీర్ణ సమస్యలు దరి చేరవు.
  • గ్లూటిన్ సమస్యతో బాధపడుతున్నవారికి రాగులు చాలా మంచి ఆహారం.
  • బాలింతలు రాగితో చేసిన లడ్డూలు తింటే పాలు పడతాయి.
  • రక్తహీనతకు చెక్ పెట్టడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి రాగులు ఎంతో తొడ్పడతాయి.
  • ఈమధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అంటూ ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. అలాంటి వారు  రోజూ రాగుల్ని ఏదో రూపంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి.
  • ఇంకా డయాబెటీస్, బీపీ, అలసట, ఊబకాయం, అతి ఆకలి వంటి దీర్ఘ వ్యాధులను కూడా ఈ రాగులు నివారిస్తాయి.
  • ఆస్తమా, గుండె జబ్బులు ఉన్న వారు కూడా రాగులతో వాటికి చెక్ పెట్టవచ్చు.
  • అయితే వర్షా కాలంలో, శీతకాలంలో మాత్రం మోతాదుకు మించి వీటిని తీసుకుంటే అతి శీతలం చేసి.. జలుబు, అజీర్ణం సమస్యలు రావచ్చు. అందుకని ఈ రెండు కాలాల్లోనూ రాగులకు కాసింత దూరం పాటిస్తే మంచిది.