Telugu Global
NEWS

జైపూర్ రూరల్ లో చాంపియన్ల సమరం

ఇటు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్…అటు కృష్ణ పూనియా జైపూర్ రూరల్ ఎంపీగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సదుల్ పూర్ ఎమ్మేల్యేగా కృష్ణ పూనియా రాజ్యవర్ధన్ కు పోటీగా కృష్ణ పూనియా…. లోక్ సభ ఎన్నికల సమరం వేడెక్కింది. అధికార బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలక నియోజకవర్గాలలో అభ్యర్ధులను బరిలోకి దించేముందు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటి వరకూ జైపూర్ రూరల్ పార్లమెంట్ స్థానంలో తిరుగులేని అభ్యర్థిగా ఉన్న కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ […]

జైపూర్ రూరల్ లో చాంపియన్ల సమరం
X
  • ఇటు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్…అటు కృష్ణ పూనియా
  • జైపూర్ రూరల్ ఎంపీగా రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
  • సదుల్ పూర్ ఎమ్మేల్యేగా కృష్ణ పూనియా
  • రాజ్యవర్ధన్ కు పోటీగా కృష్ణ పూనియా….

లోక్ సభ ఎన్నికల సమరం వేడెక్కింది. అధికార బీజెపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. కీలక నియోజకవర్గాలలో అభ్యర్ధులను బరిలోకి దించేముందు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

ఇప్పటి వరకూ జైపూర్ రూరల్ పార్లమెంట్ స్థానంలో తిరుగులేని అభ్యర్థిగా ఉన్న కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు…. పోటీగా కామన్వెల్ద్ గేమ్స్ విజేత కృష్ణపూనియాను కాంగ్రెస్ బరిలోకి దించింది.

అసెంబ్లీ టు పార్లమెంట్…

ఇప్పటి వరకూ రాజస్థాన్ లోని సదుప్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణ పూనియా….ప్రస్తుత ఎన్నికల్లో పార్లమెంట్ లో అడుగుపెట్టాలని కలలు కంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కృష్ణ పూనియా పేరు సైతం ఉండటం విశేషం.

డిస్కస్ సూపర్ స్టార్ పూనియా…

మహిళల డిస్కస్ త్రోలో కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ కృష్ణ పూనియా.. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. వచ్చే ఎన్నికల్లో సిటింగ్ ఎంపీ రాజ్యవర్ధన్‌ కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

ఏథెన్స్ ఒలింపిక్స్ లో రజత విజేత రాజ్యవర్దన్ కు గట్టి పోటీ ఇచ్చే ప్రత్యర్థి కృష్ణ పూనియా మాత్రమేనని కాంగ్రెస్ భావిస్తోంది.

ట్రిపుల్ ఒలింపియన్ కృష్ణ పూనియా…

కృష్ణ పూనియా కు 2004, 2008, 2012 ఒలింపిక్స్ లో పాల్గొన్న రికార్డు ఉంది. అంతేకాదు. 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఘనత సైతం ఉంది.

2013లో కాంగ్రెస్ తీర్థం…

వ్యక్తిగతంగా ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే కృష్ణ పూనియా…2013లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సదుల్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అయితే… గత ఏడాది జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి పూనియా విజేతగా నిలిచారు.

మొత్తం మీద ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్ లోనూ…అటు రాజకీయాలలోనూ సమర్థవంతంగా రాణిస్తున్న కృష్ణ పూనియా లోక్ సభ ఎన్నికల్లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ కు ఏమాత్రం పోటీ ఇవ్వగలరో వేచి చూడాల్సిందే.

First Published:  2 April 2019 5:35 AM GMT
Next Story