Telugu Global
Cinema & Entertainment

నిర్మాతగా మారిన అమలాపాల్

మొన్నటివరకు హీరోయిన్. ఇకపై నిర్మాత. అవును.. అమలాపాల్ నిర్మాతగా మారింది. తనే హీరోయిన్ గా, నిర్మాతగా సినిమాను సెట్స్ పైకి కూడా తీసుకొచ్చింది. తమిళ్ లో  కెడవర్ అనే సినిమాలో నటిస్తోంది అమలాపాల్. అనూప్ పానికర్ ఈ సినిమాను డైరక్ట్  చేస్తున్నాడు. ఇందులో ఫోరెన్సిక్ సర్జన్ గా నటిస్తోంది ఈ భామ. సినిమా స్టోరీ బాగా నచ్చడంతో, కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో తనే నిర్మాతగా మారి ఈ  సినిమాను తెరకెక్కిస్తోంది. అమలాపాల్ నిర్మాణ రంగంలోకి రాబోతోందనే వార్తలు ఇప్పటివి కావు. […]

నిర్మాతగా మారిన అమలాపాల్
X

మొన్నటివరకు హీరోయిన్. ఇకపై నిర్మాత. అవును.. అమలాపాల్ నిర్మాతగా మారింది. తనే హీరోయిన్ గా, నిర్మాతగా సినిమాను సెట్స్ పైకి కూడా తీసుకొచ్చింది. తమిళ్ లో కెడవర్ అనే సినిమాలో నటిస్తోంది అమలాపాల్. అనూప్ పానికర్ ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఫోరెన్సిక్ సర్జన్ గా నటిస్తోంది ఈ భామ. సినిమా స్టోరీ బాగా నచ్చడంతో, కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో తనే నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.

అమలాపాల్ నిర్మాణ రంగంలోకి రాబోతోందనే వార్తలు ఇప్పటివి కావు. దాదాపు 6 నెలల కిందటే ఈమెపై ఇలాంటి పుకార్లు గుప్పుమన్నాయి. ఆ మేరకు అప్పట్లో ఓ దర్శకుడితో అమలాపాల్ చర్చలు కూడా సాగించింది. కానీ అప్పుడు కథ సెట్ కాలేదు. ఇన్నాళ్లకు మంచి కథ దొరకడంతో అమలాపాల్ నిర్మాతగా మారిపోయింది.

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం అమలాపాల్ చాలా కష్టపడుతోంది. రియల్ లైఫ్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ లో పనిచేస్తున్న వ్యక్తుల నుంచి ఎన్నో వివరాలు తెలుసుకుంటోంది. తనే అన్ని భాషల్లో స్వయంగా ప్రచారం కూడా
కల్పిస్తుందట. సొంతంగా డబ్బులు పెట్టిన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదా.

First Published:  2 April 2019 7:02 PM GMT
Next Story