Telugu Global
NEWS

రోజర్ ఫెదరర్ 101 నాటౌట్

ఏటీపీ టూర్ లో దూసుకుపోతున్న ఎవర్ గ్రీన్ స్టార్ ఏటీపీ మియామీ ఓపెన్ ఫైనల్లో ఇజ్నర్ పై ఫెదరర్ టైటిల్ విన్ ఏటీపీ టూర్ టైటిల్స్ వేటలో….స్విట్జర్లాండ్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ ట్రోఫీ వెంట ట్రోఫీ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. 37 ఏళ్ల వయసులో 101వ ఏటీపీ టైటిల్ నెగ్గడం ద్వారా… సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ముగిసిన దుబాయ్ మాస్టర్స్ ఫైనల్లో విజేతగా నిలవడం ద్వారా…తన కెరియర్ లో 100 టైటిల్ సాధించిన ఫెదరర్ .. […]

రోజర్ ఫెదరర్ 101 నాటౌట్
X
  • ఏటీపీ టూర్ లో దూసుకుపోతున్న ఎవర్ గ్రీన్ స్టార్
  • ఏటీపీ మియామీ ఓపెన్ ఫైనల్లో ఇజ్నర్ పై ఫెదరర్ టైటిల్ విన్

ఏటీపీ టూర్ టైటిల్స్ వేటలో….స్విట్జర్లాండ్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్ ట్రోఫీ వెంట ట్రోఫీ సాధిస్తూ దూసుకుపోతున్నాడు. 37 ఏళ్ల వయసులో 101వ ఏటీపీ టైటిల్ నెగ్గడం ద్వారా… సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇటీవలే ముగిసిన దుబాయ్ మాస్టర్స్ ఫైనల్లో విజేతగా నిలవడం ద్వారా…తన కెరియర్ లో 100 టైటిల్ సాధించిన ఫెదరర్ .. ప్రస్తుత మియామీ ఓపెన్ విజయంతో…ట్రోఫీల సంఖ్యను 101కు పెంచుకోగలిగాడు. అమెరికన్ జెయింట్ జాన్ ఇజ్నర్ తో జరిగిన టైటిల్ సమరంలో ఫెదరర్ కేవలం 63 నిముషాలలోనే 6-1, 6-4తో విన్నర్ గా నిలిచాడు.

మే 26 నుంచి జరిగే ఫ్రెంచ్ ఓపెన్ లో పాల్గొనటానికి ఫెదరర్ కసరత్తులు చేస్తున్నాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ సాధించిన గ్రాండ్ స్లామ్ ట్రోఫీలలో ఒకే ఒక్క ఫ్రెంచ్ ఓపెన్ ఉండటం విశేషం. మాడ్రిడ్ వేదికగా జరిగే మాంటెకార్లో ఏటీపీ టూర్ టోర్నీ బరిలోకి ఫెదరర్ దిగనున్నాడు.

ఫెదరర్ గత రెండు దశాబ్దాల కాలంలో 154 టూర్ ఫైనల్స్ చేరుకోగా…101సార్లు విజేతగా ట్రోఫీలు అందుకొన్నాడు. అంతేకాదు…ఏటీపీ మాస్టర్స్ టోర్నీల్లో 50వసారి ఫైనల్ ఆడిన ఫెదరర్ … 28వ సారి మాస్టర్స్ ట్రోఫీ అందుకోగలిగాడు.

First Published:  3 April 2019 3:21 AM GMT
Next Story