Telugu Global
Cinema & Entertainment

ఐటెం సాంగ్ కోసం హాలీవుడ్ నటి

ఒకవైపు స్టార్ హీరోలందరూ స్టార్ హీరోయిన్లను తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్ లకు ఎంపిక చేసుకుంటుండగా మరొకవైపు ప్రభాస్ మాత్రం ఏకంగా హాలీవుడ్ నటి పైనే కన్నేశాడని తెలుస్తోంది. ఈ మధ్యనే ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ఒక హాలీవుడ్ నటిని ఐటమ్ […]

ఐటెం సాంగ్ కోసం హాలీవుడ్ నటి
X

ఒకవైపు స్టార్ హీరోలందరూ స్టార్ హీరోయిన్లను తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్ లకు ఎంపిక చేసుకుంటుండగా మరొకవైపు ప్రభాస్ మాత్రం ఏకంగా హాలీవుడ్ నటి పైనే కన్నేశాడని తెలుస్తోంది.

ఈ మధ్యనే ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ స్టాండర్డ్స్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ఒక హాలీవుడ్ నటిని ఐటమ్ సాంగ్ కోసం ఎంపిక చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే హాలీవుడ్ సింగర్ లేదా హాలీవుడ్ నటి ‘సాహో’ సినిమా లో ఐటెం సాంగ్ లో మెరిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పుడో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒక హాలీవుడ్ సింగర్ ను తన సినిమాలో చూపించాడు. కానీ తెలుగులో ఏ హీరో కూడా ఈ ఫీట్ ఇప్పటివరకు చేయలేదు.

మరి ప్రభాస్ సినిమాలో కనిపించే అవకాశం ఎవరికి దక్కనుందో తెలియాల్సి ఉంది. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, నీల్ నితిన్ ముకేష్, జాకీష్రాఫ్ మరియు మందిరాబేడీ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

First Published:  2 April 2019 9:11 PM GMT
Next Story