Telugu Global
NEWS

ఐపీఎల్ లో హ్యాట్రిక్ మెునగాళ్లు

12 సీజన్లలో 18 హ్యాట్రిక్ లు 2019 ఐపీఎల్ లో సామ్ కరెన్ తొలి హ్యాట్రిక్ ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే పరుగులవేట, పరుగల మోత. కేవలం 20 ఓవర్లు…120 బాల్స్ లో ముగిసిపోయే ఈ వీరబాదుడు ఫార్మాట్లో..హ్యాట్రిక్ లు సాధించడం…అదీ…వరుసగా మూడు బాల్స్ లో మూడు వికెట్లు సాధించడం అంటే మాటలుకాదు. 2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 2019 ఐపీఎల్ వరకూ …మొత్తం 12 సీజన్లలో ఇప్పటి వరకూ 18 హ్యాట్రిక్్ లు మాత్రమే […]

ఐపీఎల్ లో హ్యాట్రిక్ మెునగాళ్లు
X
  • 12 సీజన్లలో 18 హ్యాట్రిక్ లు
  • 2019 ఐపీఎల్ లో సామ్ కరెన్ తొలి హ్యాట్రిక్

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ అంటే పరుగులవేట, పరుగల మోత. కేవలం 20 ఓవర్లు…120 బాల్స్ లో ముగిసిపోయే ఈ వీరబాదుడు ఫార్మాట్లో..హ్యాట్రిక్ లు సాధించడం…అదీ…వరుసగా మూడు బాల్స్ లో మూడు వికెట్లు సాధించడం అంటే మాటలుకాదు.

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి ప్రస్తుత 2019 ఐపీఎల్ వరకూ …మొత్తం 12 సీజన్లలో ఇప్పటి వరకూ 18 హ్యాట్రిక్్ లు మాత్రమే నమోదు కావడం చూస్తే…ఎంత కష్టమో మరి చెప్పాల్సిన పనిలేదు.

హ్యాట్రిక్ ల కింగ్ అమిత్ మిశ్రా….

ఐపీఎల్ లో ఒకటి కాదు…రెండు కాదు…ఏకంగా మూడుసార్లు హ్యాట్రిక్ లు సాధించిన ఏకైక బౌలర్ అమిత్ మిశ్రా మాత్రమే. 2008 సీజన్లో డెక్కన్ చార్జర్స్ ప్రత్యర్థిగా తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన అమిత్ మిశ్రా…2011 సీజన్లో కింగ్స్ పంజాబ్ పై రెండు, 2013లో పూణే వారియర్స్ పై మూడు హ్యాట్రిక్ లు సాధించాడు.

యువీ డబుల్ ధమాకా….

అమిత్ మిశ్రా తర్వాత…అధిక హ్యాట్రిక్ లు సాధించిన రికార్డు సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కు మాత్రమే ఉంది.యువరాజ్ సింగ్ కు రెండు హ్యాట్రిక్ లు 2009లో డర్బన్ వేదికగా జరిగిన టోర్నీలో…బెంగళూరుపై యువీ తొలి హ్యాట్రిక్ సాధించాడు. అంతేకాదు…అదే సీజన్లో డెక్కన్ చార్జర్స్ పై యువీ రెండో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

13 మంది సింగిల్ హ్యాట్రిక్ లు….

ఐపీఎల్ లో సింగిల్ హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు 13 మంది ఉన్నారు. 2008లో మిక్యా ఎన్తినీ, బాలాజీ చెరో హ్యాట్రిక్ సాధించారు.

2009లో రోహత్ శర్మ హ్యాట్రిక్, 2010లో ప్రవీణ్ కుమార్ హ్యాట్రిక్ 2012లో అజిత్ చండీలా హ్యాట్రిక్, 2013లో సునీల్ నరైన్ హ్యాట్రిక్, 2014లో ప్రవీణ్ తంబే, షేన్ వాట్సన్ హ్యాట్రిక్ లు సాధించారు.

2016లో అక్షర్ పటేల్ హ్యాట్రిక్, 2017లో శామ్యూల్ బద్రీ, యాండ్రూ టే, జయదేవ్ ఉనద్కత్ హ్యాట్రిక్ లు నమోదు చేశారు.

2019లో సామ్ కరెన్ బోణీ….

ఐపీఎల్ 12వ సీజన్ రెండోవారం పోటీలలో….ఎట్టకేలకు తొలి హ్యాట్రిక్ నమోదయ్యింది. మొహాలీ లోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో…. ఆతిథ్య కింగ్స్ పంజాబ్ యంగ్ గన్ సామ్ కరెన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.

ఐపీఎల్ 12 సీజన్ల చరిత్రలో అతిపిన్నవయసులో హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క బౌలర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత సీజన్ మిగిలిన మ్యాచ్ ల్లో మరెన్ని హ్యాట్రిక్ లు నమోదవుతాయో మరి.

First Published:  3 April 2019 9:00 PM GMT
Next Story