Telugu Global
NEWS

మద్యాంధ్రప్రదేశ్ గా మారుతున్న ఏపీ...!

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈవీఎం పోరుకు ఎన్నో రోజులు లేదు.  ఎన్నికల బరిలో గెలిచేదెవరో… ఓటమి పాలయ్యే వారెవరో కొద్ది రోజులలోనే తేలనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు సకల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. డబ్బు సంచులతో పాటు మద్యం సీసాలను కూడా  ఓటర్లకు పంచేందుకు వివిధ నియోజక వర్గాల్లో సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ దాడులు చేస్తున్నా దాని […]

మద్యాంధ్రప్రదేశ్ గా మారుతున్న ఏపీ...!
X

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఈవీఎం పోరుకు ఎన్నో రోజులు లేదు. ఎన్నికల బరిలో గెలిచేదెవరో… ఓటమి పాలయ్యే వారెవరో కొద్ది రోజులలోనే తేలనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు సకల అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. డబ్బు సంచులతో పాటు మద్యం సీసాలను కూడా ఓటర్లకు పంచేందుకు వివిధ నియోజక వర్గాల్లో సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ దాడులు చేస్తున్నా దాని ఫలితం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు తేదీ ప్రకటించగానే టికెట్లు రావడం ఖాయం అనుకున్న అభ్యర్థులు మద్యాన్ని వేలాది కార్టన్లలో తెప్పించుకుని భద్రపరిచినట్లుగా చెబుతున్నారు. మరో రెండు మూడు రోజులలో ఈ మద్యం సరఫరా ప్రారంభించే అవకాశం ఉందని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు చెబుతున్నారు.

ఓటర్లకు పంచేందుకు విస్కీ, బ్రాందీ వంటివి వేలాది కార్టన్లు దాచినట్లుగా ఎక్సైజ్ శాఖకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కొన్ని వైన్ షాపులకు ముందుగానే డబ్బులు చెల్లించిన అభ్యర్థులు కొన్ని గ్రామాల వారికి టోకెన్ ల రూపంలో మద్యం బాటిళ్లను అందిస్తున్నారని చెబుతున్నారు.

టోకెన్ తీసుకున్న వారు ఆయా వైన్ షాపులకు వెళ్లి మద్యాన్ని తీసుకుంటున్నారని చెబుతున్నారు. వేసవి ఎండలతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు బీర్ల సరఫరా చేస్తున్నట్లు గా చెబుతున్నారు. ఎన్నికలు ముగిసేలోపు ఆంధ్ర ప్రదేశ్…. మద్యాంధ్రప్రదేశ్ గా మారుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

First Published:  3 April 2019 9:30 PM GMT
Next Story