Telugu Global
NEWS

మమ్మల్ని ఏమని బెదిరిస్తున్నారు గల్లా?.... సినీ పెద్దల ప్రశ్న !

“సినీ పరిశ్రమలో ఉన్న వారిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరిస్తున్నారు. అందుకే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు” ఇవి తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్ సభ స్థానం కోసం పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ మాటలు. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరింపులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. […]

మమ్మల్ని ఏమని బెదిరిస్తున్నారు గల్లా?.... సినీ పెద్దల ప్రశ్న !
X

“సినీ పరిశ్రమలో ఉన్న వారిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరిస్తున్నారు. అందుకే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు” ఇవి తెలుగుదేశం పార్టీ గుంటూరు లోక్ సభ స్థానం కోసం పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ మాటలు.

సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరింపులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ మండిపడుతోంది. ఎవరైనా ఏ పార్టీలో చేరేందుకైనా ప్రజాస్వామ్యంలో అవకాశం ఉందని, సినీ పరిశ్రమలో ఉన్న వారంతా తమ ఇష్టానుసారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అంటున్నారు.

గతంలో అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరారని, ఇప్పటికీ పరిశ్రమకు చెందిన అనేక మందికి ఆ పార్టీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని సినీ పెద్దలు అంటున్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారు రాజకీయ పార్టీల్లో చేరడానికి ఏ రాజకీయ పార్టీ బెదిరింపులకు పాల్పడదని, గల్లా జయదేవ్ కు తెలియకపోతే రాజకీయాలలో తనకంటే సీనియర్ అయిన తల్లి గల్లా అరుణ కుమారిని అడిగి తెలుసుకోవచ్చునని హితవు పలుకుతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పది, పన్నెండు మంది మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, రెండు వేల మంది ఉన్న సినీ పరిశ్రమలో పది పన్నెండు మంది చేరితేనే ఇంత కంగారు పడతారా? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ పెద్దలకు మధ్య ఎప్పటి నుంచో స్నేహ సంబంధాలు ఉన్నాయని, ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో కొంతమంది నటీనటులు రాజకీయ పార్టీలలో చేరుతారని అంటున్నారు.

ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో రావుగోపాలరావు, డి.రామానాయుడు, జయప్రద, సత్యనారాయణ, మోహన్ బాబు, మురళీమోహన్ వంటి అనేక మంది సినీ పెద్దలు తెలుగుదేశం పార్టీలోనే చేరి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యారు అని గుర్తు చేస్తున్నారు.

తప్పులు చేసిన వారు బెదిరింపులకు భయపడతారని, అలాంటి వారే రాజకీయ పార్టీలో చేరతారని గల్లా జయదేవ్ అనుకుంటే ఆయన ఏ తప్పులు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు నటులు రాజకీయ పార్టీలో చేరితే…. తమను ఎవరో బెదిరిస్తున్నారంటూ మాట్లాడడం గల్లా జయదేవ్ కు తగదని హితవు పలుకుతున్నారు.

First Published:  3 April 2019 9:37 PM GMT
Next Story