Telugu Global
Cinema & Entertainment

భారీ బడ్జెట్ చిత్రం నిలిచిపోయింది

భారతీయ సినీచరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద సినిమా ఏదంటే అది రజనీకాంత్ నటించిన 2.O మాత్రమే. ఈ సినిమాకు ప్రచారంతో కలిపి 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఆ సినిమాను అధిగమించే బడ్జెట్ తో మహాభారత రాబోతోందంటూ చాన్నాళ్ల కిందటే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రావాల్సిన మహాభారత ప్రాజెక్టు ఆగిపోయినట్టు స్వయంగా ఆ సినిమా నిర్మాత, దుబాయ్ బిజినెస్ మేన్ బీఆర్ షెట్టి ప్రకటించారు. […]

భారీ బడ్జెట్ చిత్రం నిలిచిపోయింది
X

భారతీయ సినీచరిత్రలో ఇప్పటివరకు అతిపెద్ద సినిమా ఏదంటే అది రజనీకాంత్ నటించిన 2.O మాత్రమే. ఈ సినిమాకు ప్రచారంతో కలిపి 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఆ సినిమాను అధిగమించే బడ్జెట్ తో మహాభారత రాబోతోందంటూ చాన్నాళ్ల కిందటే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది.

దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో రావాల్సిన మహాభారత ప్రాజెక్టు ఆగిపోయినట్టు స్వయంగా ఆ సినిమా నిర్మాత, దుబాయ్ బిజినెస్ మేన్ బీఆర్ షెట్టి ప్రకటించారు. దీనికి కారణాల్ని కూడా ఆయన వెల్లడించారు. దర్శకుడు శ్రీకుమార్ మీనన్, రచయిత ఎంటీ వాసుదేవన్ నాయర్ మధ్య అభిప్రాయబేధాలు రావడం వల్లనే మహాభారత్ సినిమా ఆగిపోయినట్టు ప్రకటించారు.

అయితే ఈ సినిమా మొత్తంగా ఆగిపోయిందనే విషయాన్ని షెట్టి కొట్టిపారేస్తున్నారు. భవిష్యత్తులో ఎవరైనా మహాభారతానికి సంబంధించి మరో మంచి స్క్రిప్ట్ తో వస్తే, తప్పకుండా వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా నిర్మించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. మహాభారతం ను తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న రాజమౌళి చెవిలో ఈ మాటలు పడే ఉంటాయి.

First Published:  4 April 2019 3:55 AM GMT
Next Story