Telugu Global
International

'మిషన్ శక్తి'పై అమెరికా విసుర్లు.... నాసా పేరిట దాడి

అంతరిక్షంలోని శాటిలైట్లను కూడా పేల్చే శక్తిని సంపాదించుకుంది మన ఇండియా. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ కలిగిన అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన ఇండియా చేరింది. గత వారంలో ఇండియా ఏ-శాట్ ప్రయోగం చేసిన తర్వాత అన్ని దేశాలతో పాటు అమెరికా కూడా అభినందించింది. కాని తాజాగా నాసా ఈ ప్రయోగంపై తమ అక్కసు వెళ్లగక్కింది. ఇప్పటికే ఏ-శాట్ ప్రయోగ సమయంలో మన శాటిలైట్‌నే కూల్చేశాము. కేవలం 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆ శాటిలైట్ […]

మిషన్ శక్తిపై అమెరికా విసుర్లు.... నాసా పేరిట దాడి
X

అంతరిక్షంలోని శాటిలైట్లను కూడా పేల్చే శక్తిని సంపాదించుకుంది మన ఇండియా. ప్రపంచంలో ఇలాంటి టెక్నాలజీ కలిగిన అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన ఇండియా చేరింది. గత వారంలో ఇండియా ఏ-శాట్ ప్రయోగం చేసిన తర్వాత అన్ని దేశాలతో పాటు అమెరికా కూడా అభినందించింది. కాని తాజాగా నాసా ఈ ప్రయోగంపై తమ అక్కసు వెళ్లగక్కింది.

ఇప్పటికే ఏ-శాట్ ప్రయోగ సమయంలో మన శాటిలైట్‌నే కూల్చేశాము. కేవలం 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఆ శాటిలైట్ భూకక్ష్యకు చాలా దగ్గరగా ఉంటుంది. దీన్ని కూల్చడం వల్ల ఏర్పడే చెత్త కూడా భూమిపైనే పడుతుందని డీఆర్‌డీఎల్, ఇస్రో ప్రకటించాయి. మన దేశం ప్రయోగం చేసిన 12 గంటల్లోనే అమెరికా తమ నిఘా విమానాన్ని పంపి అంతా పరీక్షించుకున్నారు.

కాగా, తాజాగా ఇండియా చేసిన మిషన్ శక్తిని అమెరికా శంకిస్తోంది. అంతే కాక చాలా ఆరోపణలు కూడా చేసింది. ఇండియా శాటిలైట్ పేల్చడం ద్వారా దాదాపు 400 ముక్కలు అంతరిక్షంలో పేరుకొన్నాయని.. వాటి ద్వారా తమ శాటిలైట్లకే కాక స్పేస్ స్టేషన్, వ్యోమగాములకు ప్రమాదం వాటిల్లుతుందని చెబుతోంది.

అయితే, మన శాటిలైట్ 500 కిలోమీటర్ల లోపే పేల్చేశారు. కాని ఐఎస్ఎస్ అంతకంటే చాలా ఎత్తులో ఉంటుంది. అమెరికా కావాలనే నాసా ద్వారా ఇలాంటి స్టేట్మెంటు ఇప్పిస్తోందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

First Published:  3 April 2019 9:05 PM GMT
Next Story