Telugu Global
NEWS

పేదల ఇళ్ళపై మెక్కింది 19 వేల కోట్లు ?

ఎన్నికలు దగ్గరపడేసరికి ప్రతిరోజూ ఎన్టీఆర్‌ స్వగృహ స్కీమ్‌ కింద కట్టిన గృహాలను ఎల్లోమీడియా త్రీడీలో చూపిస్తోంది. ఎన్నికల కోడ్‌ రాకముందే వందల వేల గృహాల సముదాయాలను వరుసపెట్టి ప్రారంభించేశారు. ఆ గృహాలు లబ్దిదారుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తే…. వాటిని కట్టిన కాంట్రాక్టర్లకు, వాటికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలకు మహదానందం కలిగించాయి. ఎందుకంటే…. ఈ గృహ నిర్మాణాల వెనుక కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది. దాని పేరే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన. దేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు […]

పేదల ఇళ్ళపై మెక్కింది 19 వేల కోట్లు ?
X

ఎన్నికలు దగ్గరపడేసరికి ప్రతిరోజూ ఎన్టీఆర్‌ స్వగృహ స్కీమ్‌ కింద కట్టిన గృహాలను ఎల్లోమీడియా త్రీడీలో చూపిస్తోంది. ఎన్నికల కోడ్‌ రాకముందే వందల వేల గృహాల సముదాయాలను వరుసపెట్టి ప్రారంభించేశారు. ఆ గృహాలు లబ్దిదారుల ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తే…. వాటిని కట్టిన కాంట్రాక్టర్లకు, వాటికి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలకు మహదానందం కలిగించాయి. ఎందుకంటే….

ఈ గృహ నిర్మాణాల వెనుక కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది. దాని పేరే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన. దేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన పథకం ఇది. ఈ పథకం కింద దేశంలో కట్టే ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో 1,50,000 రూపాయల సబ్సిడీ ఇస్తుంది. మిగిలినది లబ్దిదారు భరించాలి.

ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిది అయినా…. తన స్టాంప్‌ వేసేశాడు చంద్రబాబు. దీనికి ఎన్టీఆర్‌ స్వగృహ స్కీమ్‌ అని పేరు పెట్టేశాడు. ఎక్కడా ప్రధాని పేరు తలచకుండా తనే కట్టిస్తున్నట్టు ప్రజల మెదళ్ళలోకి ఎక్కించగలిగాడు. ఒక కాలనీకి అయితే ఏకంగా తన మనవడు దేవామ్ష్‌ పేరు పెట్టేశాడు.

ఈ కేంద్ర ప్రభుత్వ పథకం అన్ని రాష్ట్రాల్లోనూ అమలవుతోంది. పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చదరపు అడుగుకు 1400 రూపాయల చొప్పున కాంట్రాక్ట్‌ ఇచ్చింది. మధ్యలో సిమెంట్‌ తదితరాల ధరలు పెరిగినా ప్రభుత్వానిక సంబంధం లేదు. కాంట్రాక్టరే భరించాలి. అనేది కండీషన్‌. అదే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అడుగుకు 2,400 రూపాయలు కాంట్రాక్టర్లకు ఇస్తోంది. మధ్యలో సిమెంట్‌ తదితరాల ధరలు పెరిగితే ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అదనంగా చెల్లించే షరతు మీద. టెండర్లు పిలిచేటప్పుడు చంద్రబాబుకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించేందుకోసం ప్రత్యేక షరతులు పెట్టారు.

తెలంగాణలో ఈ వర్కులు తీసుకోవడానికి కాంట్రాక్టర్ల అర్హత ప్రామాణికంగా 1000 యూనిట్లు నిర్ణయిస్తే…. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 10,000 యూనిట్లు అర్హత ప్రామాణికంగా నిర్ణయించారు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో చిన్న కాంట్రాక్టర్లకు బిడ్‌లో పాల్గొనే అర్హత లేకుండా పోయింది. చాలా పెద్ద కాంట్రాక్టర్లు అయిన నలుగురైదుగురికే ఈ కాంట్రాక్టులు లభించాయి.

మామూలుగా మనకు స్థలం ఉంటే…. దాన్ని కాంట్రాక్టర్‌ కు అప్పగిస్తే చదరపు అడుగుకు 1,000 రూపాయల నుంచి 1,400 లోపల మంచిగా ఇల్లు కట్టి ఇస్తారు. మనం అపార్ట్‌మెంట్‌లు కొనేటప్పుడు కూడా చదరపు అడుగుకు 4,000 చెల్లిస్తే అందులో భూమి ధర 2,500 పోతే ఇక మిగిలిన 1,500 కన్‌స్ట్రక్షన్‌ కోసం మనం చెల్లిస్తాం. అంటే చదరపు అడుగుకు రూ. 1,000 నుంచి 1,500 లోపల మంచిగా కట్టుకోవచ్చు. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మాణానికే చదరపు అడుగుకు 2,400 రూపాయలు చెల్లించింది.

తెలంగాణ ప్రభుత్వం చదరపు అడుగుకు కాంట్రాక్టర్‌కు రూ. 1,400 కి ఇస్తే…. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం రూ. 2,400 చెల్లించడమే కాకుండా కాంట్రాక్టర్లకు భూమిని ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇసుకను కూడా ఉచితంగా అందజేసింది. అంటే చదరపు అడుగుకు 1,000 రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లించింది.

ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించిన ఇళ్ళ మొత్తం పరిమాణం 37 కోట్ల చదరపు అడుగులు. ఒక్క చదరపు అడుగుకు 1,000 రూపాయలు ఎక్కువగా చెల్లించింది, ఆ ప్రకారం లెక్క వేసుకుంటే 37 వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు లెక్క. ఇందులో సగం కాంట్రాక్టర్‌ కు, సగం ప్రభుత్వ పెద్దలకు అనుకుంటే సుమారు 19 వేల కోట్లు అప్పనంగా తినేశారనేది సివిల్‌ ఇంజనీర్లు చెబుతున్న లెక్క.

First Published:  4 April 2019 6:52 AM GMT
Next Story