‘బన్నీ’…. ప్రొడక్షన్ హౌస్ లేనట్లే!

గీత ఆర్ట్స్ తన హోమ్ బ్యానర్ అయినప్పటికీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేక ఆఫీస్ ను ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. దీని వెనుక బోలెడు కారణాలు ఉన్నాయని వార్తలు బయటకు వచ్చాయి. కానీ చాలామంది చెప్పే విషయం ఏమిటంటే బన్నీ కొత్త ఆఫీస్ తో సినిమాలను నిర్మించాలని ప్లాన్స్ చేస్తున్నాడని…. ఈ నేపథ్యంలోనే చాలామంది రైటర్లను పిలిచి కథలు వినిపించమని అడిగాడని చెబుతున్నారు. ఇప్పటికే బన్నీ కొన్ని కథలు వినటం కూడా జరిగింది.

కానీ తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇప్పుడు ఈ ప్లాన్ ని పక్కన పెట్టేశాడట. ఎందుకు అలా చేసాడు అంటే…. బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడమేనట. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉంటుందని బన్నీ అనౌన్స్ చేశాడు. కానీ ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు.

అసలే సంవత్సరం నుంచి అభిమానులు తన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రొడక్షన్ పై దృష్టి పెడితే అభిమానులు నిరాశ చెందే అవకాశం ఉంది. అందుకే ఈ ఐడియా ని పక్కన పెట్టి త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడట బన్నీ.