ఇంతకీ రేపు ఎన్టీఆర్ వస్తున్నాడా?

రేపు సాయంత్రం చిత్రలహరి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ ఫంక్షన్ జరుగుతుంది. ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్టు కొన్ని రోజుల కిందట వార్తలొచ్చాయి. ఇప్పుడేమో యూనిట్ ఆ విషయాన్ని మరిచిపోయినట్టుంది. ఇంతకీ ఎన్టీఆర్ వస్తున్నాడా.. రావట్లేదా..?

నిజానికి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్రీగానే ఉన్నాడు. పైగా హైదరాబాద్ లోనే ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. కానీ అనుకోకుండా రామ్ చరణ్ గాయపడ్డాడు. దీంతో షూటింగ్ ను 3 వారాలు వాయిదావేశారు. సో.. ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఖాళీ. మరి చిత్రలహరి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వస్తున్నాడా లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రెగ్యులర్ గా తారక్ తో టచ్ లో ఉంటారు. ఆర్-ఆర్-ఆర్ తర్వాత తారక్ కూడా తన నెక్ట్స్ మూవీని ఇదే బ్యానర్ పై చేయాలి. సో.. ఆ చనువుకొద్దీ మైత్రీ నిర్మాతలు పిలిచిన వెంటనే రావడానికి తారక్ ఒప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. కట్ చేస్తే, ఇప్పుడేమో తారక్ ప్రస్తావన లేకుండానే ప్రీ-రిలీజ్ కు ఏర్పాట్లు స్టార్ట్ చేశారు.