Telugu Global
NEWS

మరో రెండు భారీ పథకాలను ప్రకటించిన జగన్

జగన్‌ మోహన్ రెడ్డి రెండు కీలకమైన పథకాలను ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం భారీ వైద్య పథకాన్ని ప్రకటించారు. ఏడాదికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ యూనివర్సల్ హెల్త్‌ కార్డులు ఇస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూనే నెలకు 40వేల వరకు జీతం ఉన్న వారికి కూడా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. ఈ కార్డుల సాయంతో తక్షణ వైద్య సేవలు అందుకోవచ్చు. ఎక్కడా లేని విధంగా పిల్లలను చదివించుకోవడానికి ప్రైవేట్ […]

మరో రెండు భారీ పథకాలను ప్రకటించిన జగన్
X

జగన్‌ మోహన్ రెడ్డి రెండు కీలకమైన పథకాలను ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజల కోసం భారీ వైద్య పథకాన్ని ప్రకటించారు. ఏడాదికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ యూనివర్సల్ హెల్త్‌ కార్డులు ఇస్తామని ప్రకటించారు.

ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూనే నెలకు 40వేల వరకు జీతం ఉన్న వారికి కూడా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. ఈ కార్డుల సాయంతో తక్షణ వైద్య సేవలు అందుకోవచ్చు.

ఎక్కడా లేని విధంగా పిల్లలను చదివించుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు తల్లిదండ్రులు లక్షల మేర ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంతో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రిస్తామని జగన్‌ ప్రకటించారు.

ఫీజులు తగ్గించి తేడా చూపిస్తామని జగన్ ప్రకటించారు. ఫీజుల నియంత్రణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే పర్యవేక్షణ కమిటీ పనిచేస్తుందని జగన్‌ ప్రకటించారు.

First Published:  5 April 2019 9:42 AM GMT
Next Story